Abdul JavidNandyal

దళిత ఆడబిడ్డ కుటుంబానికి అండగా నిలబడితే అరెస్టు చేస్తారా? ఎన్.ఎమ్.డి ఫారూఖ్

నంద్యాల (పల్లెవెలుగు) ఆగస్టు 16: తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్సీ ఎన్.ఎమ్.డి ఫారూఖ్ మాట్లాడుతూ గుంటూరులో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన దళిత విద్యార్థిని రమ్య కుంటుబాన్ని పరామర్శించడానికి వెళ్లిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ను, టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మహిళల మాన,  ప్రాణాలకు రక్షణ కల్పించడంలో వైస్సార్సీపీ ప్రభుత్వం విఫలమైందని బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన టీడీపీ నాయకులను అరెస్ట్ చేయడం జగన్ రెడ్డి నియంతృత్వ వైఖరికి నిదర్శనమని ఈలాంటి చర్యలు ప్రజాస్వామ్య హక్కులను కలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అరాచక పాలన కొనగుతుందండానికి ఈ సంఘటన నిదర్శనమని మాజీ మంత్రి, దళిత నాయకుడు నక్క ఆనంద్ బాబుపై స్థానిక జిల్లా ఎస్పీ చేయిచేసుకోవడం దుర్మార్గమని మీడియా ప్రతినిధులతోనూ దురుసుగా ప్రవర్తించి కెమెరాలు పగలగొడితే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు. పరిధిదాటి వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు

Back to top button
Enable Notifications    OK No thanks