Abdul JavidNandyal

75 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ను ఆవిష్కరిస్తూ ముస్లింలు రాజ్యం హక్కులకై పోరాడాలని పిలుపునిచ్చిన మౌలానా ముస్తాక్ అహ్మద్

నంద్యాల (పల్లెవెలుగు) 15 ఆగష్టు: 75 వ  స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి జాతీయ జెండాను వారి ఆఫీసులో ఎగరవేసిన లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహ్మద్. ఈ సందర్భంగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ స్వాతంత్ర  పోరాటంలో  ముస్లింలు ముందుండి పోరాటాలు చేశారని ఆయన కొనియాడారు. ఇంక్విలాబ్ జిందాబాద్ పిలుపు ఇచ్చి సంపూర్ణ స్వతంత్రం కోసం పోరాడిన మౌలానా హస్రత్ మోహాని అలాగే సైమన్ గోబ్యాక్ కిట్ ఇండియా నినాదాలు ఇచ్చిన యూసుఫ్  మోహరి జైహింద్ నినాదం ఇచ్చిన  సుభాష్ చంద్ర బోస్ తో విద్యాభ్యాసం మానేసి పాల్గొన్న అబిడ్  హుస్సేన్ అలాగే  రామ్ ప్రసాద్ బిస్మిల్  తో కలిసి కర్కోరి కుట్ర కేసులో ఉరి శిక్ష గురైన అస్మత్ ఉల్లాఖాన్ అలాగే టిప్పుసుల్తాన్ తండ్రి హైదర్ అలీ మైసూర్ నో పాలిస్తూ బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ప్రాణాలు వదిలినాడు. టిప్పు సుల్తాను మరియు అహ్మద్ షరీఫ్ ఇస్మాయిల్ షహీద్ ఎందరో మహానుభావులు ఇలాంటి ఎన్నో మహానుభావులు స్వాతంత్రం కోసం పోరాడి పోరాడి జిల్ జైలులో శిక్ష పొంది ప్రాణాలు వదిలింది మహా నాయకుడు అని ఆయన కొనియాడారు.  కమ్యూనిస్టు మహా నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య దక్షిణ భారతదేశంలో లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటుకు అమీర్ హైదర్ ఖాన్, ముజఫర్ అహ్మద్ ఉద్యమంలో పాల్గొన్న గొప్ప నాయకులు గుర్తు చేసుకుంటూ  నరేంద్ర మోడీ ప్రజావ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక విధానాలను దేశంలో ముస్లింలపై జరుగుతున్న దాడులను  ప్రతిఘటిస్తూ పోరాడాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నంద్యాల డివిజన్ నాయకులు సలాం మౌలానా, ఫరీద్ ,జాకీర్ ,రషీద్,రఫీ,బాష, ముస్లిం ప్రముఖులు ,సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks