Abdul JavidNandyal

ప్రగతి ఫలాలు సామాన్యులకు చేయాలి – జాతీయ పతాక ఆవిష్కరణ సభలో జేఎసి సమద్

నంద్యాల (పల్లెవెలుగు) 15 ఆగష్టు: ఎస్బిఐ కాలనీ రసూల్ మజీద్ ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో ముస్లిం జేఎసి కన్వీనర్ అబ్దుల్ సమద్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగుర వేశారు. ఈ సందర్భంగా సమద్ మాట్లాడుతూ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరంలో అసువులు బాసిన మహానీయులకు నివాళి అర్పించారు. ఈ త్రివర్ణ పతాక రెపరెపలు అందరి హృదయాల్లో దేశభక్తి జనించాలనీ, స్వాతంత్ర్య ఫలాలు సామాన్యుల లేడీకి చేరాలనీ, పాలకులు స్వలాభం మాని ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మజీద్ ఇమాం హాఫీజ్ ముహమ్మద్ సలీం పర్వేజ్, బాషా, పర్వేజ్, అస్లం, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks