Abdul JavidNandyal

సమాజానికి దిశా నిర్దేశకులు –  జర్నలిస్టులను సన్మానించిన జమాతె ఇస్లామి

నంద్యాల (పల్లెవెలుగు) 15 ఆగష్టు: ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైన జర్నలిస్టు సోదరులను స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా నంద్యాల జమాఆతె ఇస్లామి హింద్ సన్మానించింది. యూనిట్ ప్రెసిడెంట్ అబ్దుల్ సమద్ అధ్యక్షతన జమాత్ ఆఫీసులో జరిగిన సన్మాన సభలో జమాత్ రాష్ట్ర కార్యదర్శి కే.యం.సుభాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రింట్ మీడియా జావేద్, మధు బాబు, మహబూబ్ బాషా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఇసాక్ బాషా, రాజేశ్, సాయీ, కుమార్, హరీ, లకు జమాత్ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా సమద్ మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలను చైతన్యం చేయడంలో మీడియా కీలక పాత్ర పోషించిందని, నేటికి సమాజానికి దిశానిర్దేశం చేస్తుందన్నారు. చాలి చాలని జీతాలతో గురుతర బాధ్యతలను నెరవేర్చుతున్న జర్నలిస్టు సేవలను కొనియాడారు. నంద్యాలలో వక్ఫ్ ఆస్తుల విషయంగా కొందరి పరిశోధనలతో ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. సుభాన్ మాట్లాడుతూ మీడియా సోదరులు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలై, నాలుగో సింహంలా కాపల కాస్తు ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని అవినీతిని బయట పెడుతున్నారని అభినందించారు. మధు బాబు మాట్లాడుతూ వార్త యదార్థంగా రాయడంలో, అన్యాయాన్ని బయట పెట్టడంలో ఆత్మ తృప్తి ఉందన్నారు. మహబూబ్ బాషా మాట్లాడుతూ గట్టిగ వార్తా రాయాలంటే ధైర్యం ఉండాలన్నారు. జవిద్ మాట్లాడుతు సోషియల్ మీడియా, యూట్యూబ్ మీడియా అంటు చులకన చేయడం సబబూగా లేదని, వార్త ప్రాముఖ్యత గుర్తించాలన్నారు. అనంతరం మధూ, మహబూబ్ బాషా, జావేద్, ఇసాక్ బాషా, రాజేష్, సాయీ, కుమార్, కషొర్, హరీ లను శాలువా కప్పి మెమోంటో ఇచ్చి జమాత్ నాయకులు సన్మానించారు.


సమాజంలో పెరుగుతున్న రుగ్మతలను వారిస్తూ, మతసామరస్యం ఐక్యత కోసం ప్రజలలో సద్భావన భావాలు పెంపొందించడం కోసం నంద్యాలలో సద్భావన సంఘం ఏర్పడింది. కన్వినర్ గా యస్.సైఫుల్లాహ్ కో కన్వీనర్లుగా డా. కళామురళి, ఆల్ఫోన్సస్ ను ఎన్నుకున్నారు. భవిష్యత్తులో విస్తృత స్థాయి సమావేశంలో ఇంకా సభ్యులను ఎన్ను కుంటాయి కన్వీనర్ సైఫుల్లాహ్ తెలిపారు.సమావేశంలో జమాత్ నాయకులు సుభాన్, సమద్ పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks