Abdul JavidNandyal

సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక  జిల్లా కార్యాలయం నంద్యాల పట్టణం లో  ప్రారంభం  

నంద్యాల (పల్లెవెలుగు) 14 ఆగష్టు: స్ధానిక నంద్యాల పట్టణం లో రామనాథ సినిమా హాల్ వెనుక వైపున  సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక జిల్ల కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షులు అకుమాల్ల రహీమ్ అధ్యక్షతన  శనివారము రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ రెడ్డి చే ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ మా ఐక్యవేదిక ప్రధాన లక్ష్యం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షితు రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసుకొనే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయడం ప్రధాన ఉద్దేశం తో  ప్రజలకు గ్రామ సభలపైన, భారత రాజ్యాంగము పైన మరియు సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిపిస్తున్నమా ఐక్య వేదిక. భారత రాజ్యాంగము ప్రకారం ప్రజలే యజమానులు ,పర్యవేక్షణ బాధ్యత కూడా ప్రజలదే. ప్రస్తుతం ప్రజలు కు చట్టలపైన ,రాజ్యాంగం పైన అవగాహన లేకపోవడంతో ప్రజలు తమ యాజమాని తనాన్ని  ప్రజలు మరచి పోయారు . అందుకోసమే మా సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజాస్వామ్య పరిరక్షణ భాద్యతలను తెలుపుతున్నాను అని తెలిపారు.  జిల్లా కార్యవర్గ   సమావేశం నిర్వహించి భవిషత్తు కార్యక్రమాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ కార్య్రమానికి జిల్లా అధ్యక్షులు అకుమాళ్ళ రహీమ్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ రెడ్డి ,  కర్నూలు నగర అధ్యక్షులు రవికుమార్ , జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్ ,  నంద్యాల పట్టణం అధ్యక్షులు గులాబ్ హుస్సేన్ , నంద్యాల పట్టణం కోశాధికారి డీపీ మస్తాన్ వలీ, నంద్యాల రూరల్ మండల అధ్యక్షుడు ఉమా మహేష్ , ఉపాధ్యక్షులు శివ నారాయణ , బండి ఆత్మకూరు మండలం అధ్యక్షులు సమంగి రామ రాజు,  పములపాడు మండలం కన్వీనర్ చిన్నా నాగన్న , మరియు సభ్యులు డి మురళి,  నగకాంత్ రెడ్డి , చెన్నా రెడ్డి , నబిరసూల్ , మౌలాలి,  శ్రీనివాసులు  తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks