
కో అప్షన్ గా అవకాశం కల్పించండి
నంద్యాల (పల్లెవెలుగు) సంవత్సరాల తరబడి వైసీపీ పార్టీలో కొనసాగుతూ పార్టీకోసం అహర్నిశలు పనిచేసిన తనకు కో అప్షన్ సభ్యుడిగా అవకాశం కల్పించాలని పఠాన్ జాకీర్ (రెడ్డి జాకీర్) కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు కో – అప్షన్ గా ఉండటానికి తెలిపిన అన్ని అర్హతలు తనకు ఉన్నాయని అన్నారు. అలాగే ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యే ఆదేశాలను తూచా తప్పకుండా అనుసరిస్తూ ప్రజా సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళుతు మావార్డు మాత్రమేకాక నంద్యాల పట్టణ పరిధిలోగల అన్ని రకాల ప్రజా సమస్యలను పాలకులకు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేసి పార్టీకి ప్రభుత్వనికి మంచిపేరు రావాలని తపన పడ్డ తనకు మైనారిటీ కోటాలో కో అప్షన్ గా అవకాశం కలిగించాలని పత్రిక ముఖంగా కోరుకుంటున్నానని అన్నారు. పార్టీ కోసం కష్టపడేవారికి తగిన సమయంలో గుర్తింపు తప్పక లభిస్తుందన్న నమ్మకాన్ని ఇటీవల ముఖ్యమంత్రి కార్యకర్తలలో కలిగించేలా సామాన్యులను సైతం రాష్ట్ర,జిల్లా కార్పొరేషన్ లలో చైర్మన్లుగా, డైరెక్టర్లుగా అవకాశం కలిగించారని సంవత్సరాలుగా పార్టీకి విధేయుడుగా నున్న తనను కూడా గుర్తించాలని కోరారు.