
టెలిమెడిసిను సౌకర్యంను సద్వినియోగం చేసుకోండి
నంద్యాల (పల్లెవెలుగు) 13 ఆగష్టు: మండలం పరిధిలోని పులిమద్ది గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రంలో(వైస్సార్ హెల్త్ క్లినిక్) టెలిమెడిసిను అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కర్యక్రమంలో ఎమ్ ఎల్ హెచ్ పి సుజాత మాట్లాడుతూ గ్రామ ప్రజలు అందరు టెలిమెడిసిను సౌకర్యంను ఉపయోగించుకోవాలని మీకు చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన ఆ సమస్య గురుంచి టెలిమెడిసిను హబ్ లోని స్పెసిలిస్ట్ డాక్టర్ వారితో వీడియో కాల్ ద్వారా మీ సమస్యను వివరించడం జరుగుతుంది వారి సలహా ద్వారా మీకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందని ఈ ఆరోగ్య ఉపకేంద్రంలో ( వైస్సార్ హెల్త్ క్లినిక్) 12 రకాల సేవలు.. 65 రకాల మందులు 14 రకాల నిర్దారణ పరీక్షలు అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది. గ్రామ సర్పంచ్ రఘురామిరెడ్డి మాట్లాడుతూ టెలిమెడిసిను సదుపాయాలను ఉపయోగించుకవాలి మరియు ఆరోగ్య కేంద్రంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి భీమిరెడ్డి మరియు ఏఎన్ఎమ్ సుబ్బలక్ష్మీ , దస్తగిరమ్మ మరియు సామన్న గ్రామ ప్రజలు పాల్గొన్నారు.