Abdul JavidNandyal

 తప్పు చేసి స్టేషన్ల చుట్టూ తిరుగొద్దు, సరిదిద్దుకొని సన్మార్గంలో నడుద్దాం..వాల్మీకి నేతలు

నంద్యాల (పల్లెవెలుగు) 12 ఆగష్టు: తప్పుచెయ్యటం మానవసహజం, చేసిన తప్పును సరిదిద్దుకొని సన్మార్గంలో నడిచినప్పుడే మానవ జన్మకు సార్తకత చేకూరుతుందని వాల్మీకి సంఘ రాష్ట్ర నేత బోయ పులికొండన్న, వాయిస్ సంస్థ అధ్యక్షులు మురళీకృష్ణ లు పేర్కొన్నారు. గురువారం ఉదయం శ్యాంనగర్, దేవనగర్ వాల్మీకుల సమావేశం స్థానిక వాల్మీకిరామాలయంలో పట్టణ వాల్మీకి నేత సుబ్రమణ్యం ఆధ్వక్షతన జరిగింది ఈ సమావేశంలో పులికొండన్న, మురళీకృష్ణ లు మాట్లాడుతూ దేవనగర్, శ్యాంనగర్ అంటేనే కొంతమందిలో హేయభావం ఉందని మనం ఎంతమంచిగా బ్రతికినా మచ్చమాత్రం తొలగిపోవటం లేదని, కొంతమంది మట్కా,సారా ఇతర అలవాట్లకు బానిసలు అయ్యి జీవితాలు నాశనం చేసుకొంటున్నారని, తప్పు చేసి ఒక్కసారి అరెస్ట్ అయినా పదే, పదే అదే కేసులతో వేధింపులకు గురవుతున్నారని, అదే డబ్బున్న వాళ్ళు,రాజకీయ పలుకుబడి ఉన్నవారు ఎన్ని తప్పులు చేసినా వేలెత్తి చూపక పోగా వారికి సెల్యూట్ కొడతారని,అదే పేదవాడు తప్పు చేస్తే మాత్రం వేధింపులు మాములుగా ఉండటం లేదని, మేము తప్పు చెయ్యటంలేదని మొత్తుకున్నా, ఎవరో చెప్పారని వేధింపులకు గురిచెయ్యటం జరుగుతోందని, దానివల్ల అప్పులపాలు కావటం, మానసిక వేదనకు గురికావడం, ఆత్మహత్య చేసుకోవడం, అనారోగ్య0పాలు కావటం, లేదంటే ఊరువిడిచి వెళ్ళటానికో సిద్ధమౌతారు కనుక ముందు మనం తప్పు చెయ్యకుండా ఉందాం, తప్పు చెయ్యకుండా వేధింపులకు గురిచేస్తే ఎటువంటి పోరాటా నికైనా తాము సిద్ధంగా ఉంటామని తప్పు చేసి రక్షించమంటే మాత్రం తాము సహకరించమని అలాంటి వారు మా దగ్గరికి రావొద్దని ఖరాఖండిగా చెపుతున్నామన్నారు.  ఎవరో కంప్లైంట్ ఇస్తే గుడ్డిగా కేసు పెట్టకుండా పూర్తిగా విచారణ చేసి కేసులు నమోదు చెయ్యాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు గతంలో తాము తెలియక తప్పు చేశామని, అవన్నీ మానేశామని మేము ఇక తప్పు చెయ్యమని వాల్మీకి మహర్షి ముందు శ్రీనివాస్ అనే వ్యక్తితో ప్రమాణం చేపించారు.  వాయిస్ అధ్యక్షులు మురళీకృష్ణ మాట్లాడుతూ చదువుకుంటున్న వాల్మీకి యువత ఎవరైనా పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే దానికి సంబంధించిన స్టడి మెటీరియల్ ఇప్పిస్తామని, ఓ చిన్న టెస్ట్ పెట్టి వాటిలో మంచి మార్కులు వచ్చిన వారికి ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తామని, చదువుకోవాలని ఆసక్తి ఉండి, ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమయ్యే వారికి సహాయ సహకారాలు అందిస్తామని కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వాల్మీకి విద్యార్థులకు విజ్ఞప్తి చేసారు  ఈ కార్యక్రమంలో టీచర్ వెంకటేశ్వర్లు, పట్టణ వాల్మీకి నేతలు సవారీ, నాగేంద్ర, మళ్ళీ, వాల్మీకి యువనేతలు పరమేష్, శివనాగేంద్ర, రమేష్, మధు, మల్లికార్జున, శ్రీనివాసులి, సాయి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks