yemmiganuru

నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి – Affected farmers should be supported immediately

ఎమ్మిగనూర్ (పల్లె వెలుగు)14 సెప్టెంబర్: రాష్ట్ర టిడిపి పార్టీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో మరియు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైనందున నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలనే నినాదంతో స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు రాష్ట్ర టిడిపి సెక్రెటరీ, ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిశీలకులు ఆలం నరసానాయుడు తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ నీలంకంఠుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి సద్భుద్ది ప్రసాదించి రైతులను వెంటనే ఆదుకోవాలని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ శరాఫ్ బజార్, పెద్దమసీదు, గాంధీ సర్కిల్ నుండి సోమప్ప సర్కిల్ వరకు

  • పంటలకు గిట్టుబాటు ధర వెంటనే- కల్పించాలి,
  • వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే – ఆదుకోవాలి,
  • RDS ప్రాజెక్టును వెంటనే – పూర్తి చేయాలి,

 రైతు కోసం – తెలుగుదేశం అని నినాదాలు చేస్తూ ఎమ్మిగనూరు నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు,  రైతులు, తెలుగు మహిళలు, తెలుగు యువత, NTR బాలకృష్ణ అభిమానులు, TNSF సభ్యులు అందరితో కలిసి నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు, రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు డా.బివి జయనాగేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button