Abdul Javidsrisailam

శ్రీశైలం ఘాట్ రోడ్డులో రోడ్ యాక్సిడెంట్ ఇద్దరికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం

శ్రీశైలం (పల్లెవెలుగు) 23 అక్టోబర్:  ఘాట్ రోడ్డులోని ముఖద్వారం సమీపంలో  రోడ్డు ప్రమాదం జరిగింది  ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి వారి పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో సుండిపెంట ప్రభుత్వ వైద్యశాలకు  సిబ్బంది తరలించారు   శ్రీశైలానికి చెందిన లక్ష్మారెడ్డి , కృష్ణుడుగా పోలీసులు గుర్తించారు సున్నిపెంట నుంచి మద్యం మత్తులో స్కూటిపై వెలుతూ ముఖద్వారం సమీపంలో స్కూటి అదుపు చేయలేక రోడ్డుపై అదుపు తప్పి కిందపడి తీవ్రగాయాలయ్యాయి విషయం తెలుసుకున్న 108 వాహనం సిబ్బంది పోలీసులు ఘటన స్దలానికి చేరుకుని 108 వాహనంలో సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు వారిని తరలించారు వైద్యులు ప్రధమ చికిత్స నిర్వహించారు వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు శ్రీశైలం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు

Back to top button