
మహిళలపై జరుగుతున్న వేదింపులకు, అత్యాచారాలకు నిరసనగా సంఘీబావ ర్యాలీ
మహిళలపై జరుగుతున్న వేదింపులకు, అత్యాచారాలకు నిరసనగా సంఘీబావ ర్యాలీ
పత్తికొండ (పల్లెవెలుగు) 28 ఏప్రిల్: టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ కే.ఈ. శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు మహిళలు, నాయకులు కార్యకర్తలు, యువత కలసి పార్టీ కార్యాలయం నుండి నాలుగు స్తంభాల వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళలకు రక్షణ కరువు అయిందని అక్క, చెల్లెమ్మలు, ఒక్క చాన్స్ ఇవ్వండి మన ప్రభుత్వం వస్తే మహిళలకు పెద్ద పీట వేస్తాను అని అధికారంలోకి వచ్చి, ఈ రోజు మహిళలపై జరుగుతున్న దాడులకు ఏ మాత్రం స్పందించకుండా తాడేపల్లి లో నిద్రపోతున్నా జగన్. ఈ మూడేళ్ళలో మహిళలపై 1500 మందికి లైంగిక వేదింపులు జరిగాయి. మహిళలపై జరుగుతున్న దాడుల్లో దేశంలో మొదటి స్థానంలో ఉంది, మహిళలపై అఘాయిత్యాలు, దాడులు చేసిన వారు దర్జాగా బయట తిరుగుతున్నారు. రాష్ట్రంలో రోజు ఎక్కడో ఒక దగ్గర మహిళలపై అఘాయత్యాలు జరుగుతూనే ఉన్నాయి, మొన్న విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ నందు మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం చేసినందుకు మా నాయకుడు పరామర్శించి వస్తుంటే, అక్కడ ఉన్నటువంటి మహిళా కమిషన్ ఏమండీ ఎం న్యాయం చేస్తున్నారు అని అడిగినందుకు మా నాయకుడు కి నోటీస్ లు ఇచ్చారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, రాబోయే రోజులలో ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజు దగ్గలోనే ఉంది అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జానకమ్మ, తుగ్గలి మండలం మహిళా అధ్యక్షురాలు ఈరమ్మ ,పత్తికొండ మండలం మహిళ అధ్యక్షురాలు బేగం, పార్లమెంట్ మెయిన్ కమిటీ నాయకులు, పార్లమెంట్ అనుబంధ కమిటీ నాయకులు, రాష్ట్ర/పార్లమెంట్/నియోజకవర్గ/పట్టణ/మండల యువత, TNSF, SC సెల్, ST సెల్, మహిళ నాయకులు, నాయకురాలు, పట్టణ, మండలాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు