PattikondaMani News

యాదవోద్దరణకై యాదవులు ఐక్యం కావాలని

యాదవోద్దరణకై యాదవులు ఐక్యం కావాలని
యాదవ మహాసభ నూతన కమీటీ ఏర్పాటు
యాదవ్ మహసభ‌ జిల్లా ఆర్గనైజర్ రాజా నరేశ్ కుమార్ యాదవ్

పత్తికొండ (పల్లెవెలుగు) 10 ఏప్రిల్ : యాదవ జాతి ఉద్దరణకై యాదవుంతా ఐక్యత కావాలని అఖిల భారత యాదవ మహాసభ కర్నూలు, నంద్యాల ఆర్గనైజర్ రాజా నరేశ్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సాయిబాబా దేవాలయం ప్రాంగణంలో నిర్వహించిన యాదవ్ యువజన సమావేశంలో ఆయన పాల్గోని మాట్లాడారు  భారతావనిలో చరిత్ర ఉందంటే  అది ఒక్క యాదవ జాతికే ఉందన్నారు.  చరిత్ర అంటే యాదవులదే అన్నారు. ఏ నాడో భరత భూమిని పాలించాం అన్నారు.  భారత దేశం వ్యాప్తంగా ఏమూలైనా యాదవులు ఉన్నారన్నారు  యాదవులు చైతన్యమైతే భారతావనికి కాబోయే పాలకులు మనమేనన్నారు. ప్రతి యాదవుడు తమ పేరు చివర యాదవ్ అని తప్పని సరిగా రాయాలని సూచించారు. అఖిల భారత యాదవ మహాసభ ఆవిర్భావం జరిగి 100 సంవత్సారాలు పూర్తై, శతజయంతి ఉత్సవాలకు సిద్ధం అవుతోందన్నారు.  అందుకు మనం సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం యాదవున్ని ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేర్చే దిశగా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో యాదవాభ్యున్నతికై శిక్షణా తరగతులకు తిరుపతిలో శ్రీకారం చుట్టారన్నారు. యాదవులందరిని ఒకే తాటి పైకి తెచ్చే ద్యేయంగా నే తాము పనిచేయడం జరుగుందన్నారు. యాదవ మహాసభ పత్తికొండ బాధ్యులు గుడిసె నర్సింహులు యాదవ్ మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గంలో 28 శాతం యాదవ జనాభా ఉందన్నారు. యాదవుల ఐక్యత తీసుకు రావడమే ద్యేయమన్నారు. హౌషూరు, పత్తికొండ ప్రాంతంలలో శ్రీ కృష్ణ దేవరాయలు, కళ్యాణ మండపాల  నిర్మాణాలు చేపట్టి , శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించే ప్రణాళిక ఉందన్నారు.  యాదవజాతి ఉద్దరణకై పాటుపడడమే ధ్యేయమన్నారు. అనంతరం యాదవ మహాసభ పత్తికొండ తాలుకా  యువజన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా శివకుమార్ యాదవ్, ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్ యాధవ్, వంశీ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా సురేష్ యాదవ్, శివ కుమార్ యాదవ్, రాజశేఖర్ యాదవ్, కోశాధికారిగా ఆకులు రాజేష్ యాదవ్, ఆర్గనైజింగ్ కమిటి కార్యదర్శులుగా పిజి దత్తు యాదవ్, బాలరాజు యాదవ్, రవికుమార్ యాదవులతో పాటు కమీటీ సభ్యులుగా అశోక్‌యాదవ్,  కౌలుట్లయ్య యాదవ్, మహేష్ యాదవ్, పౌవన్ యాదవ్, మధుయాదవులను ఎన్నుకున్నారు. వీరితో పాటు పత్తికొండ యాదవ్ మహాసభ బాధ్యులుగా సీమరత్నం రామాంజనేయులు యాదవ్, ఉరుకుందు యాదవ్, సజ్జప్ప యాదవ్, చంద్రశేఖర్ యాదవ్,  వీరాంజినేయులు యాదవ్, కుమార్ యాదవ్ వీరేంద్ర యాదవులను ఎన్నుకున్నారు.

Back to top button