PattikondaMani News

ఆర్గనైజింగ్ కమిటీ నియామకం పై సమావేశం

ఆర్గనైజింగ్ కమిటీ నియామకం పై సమావేశం

పత్తికొండ పట్టణంలో త్వరలో పెద్ద ఎత్తున యాదవ మహాసభ సమావేశం నిర్వహించబోతున్నట్లు  అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఆర్గనైజర్ రాజా నరేశ్ కుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అఖిల భారత యాదవ మహాసభ శత జయంతి ఉత్సవాల్లోకి అడుగు పెట్టిన సందర్బంగా పత్తికొండ లో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహణ తలపెట్టామన్నారు.  ఇందుకు యాదవ బందు మిత్రుందరు బారీ ఎత్తున పాల్గోనేందుకు ఆదివారం ఆర్గనైజింగ్ కమిటిని నియమించేందుకు సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశం స్థానిక సాయిబాబా దేవాలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ  ఆర్గనైజింగ్ సమావేశానికి యాదవ బందు, మిత్రులందరు పాల్ఖోనాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు రామాంజినేయు యాదవ్, ఉరుకుందు యాదవ్,  రాజేష్ యాదవ్, ఉద్రేకాన్ని యాదవ్, పందికోన శివ యాదవ్, కనకదిన్నే కౌలుట్ల యాదవ్, చక్రాల్ల శివ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks