Abdul JavidPattikonda

ఆకస్మికంగా గ్రామ సచివాలయాలు తనిఖీ

  • సమస్యలు తీర్చేలా సచివాలయాలు పని చేయాలి
  • ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించండి
  • గ్రామ సచివాలయం సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు

కర్నూలు (పల్లెవెలుగు) సెప్టెంబర్ 28 :  ప్రభుత్వ ఆశయం సిద్ధించేలా అన్ని రకాల సేవలను సచివాలయాల్లోనే ప్రజలకు అందించాలని గ్రామ సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం పత్తికొండ  గ్రామ సచివాలయం 1 మరియు 3 లను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదోని ఆర్.డి.ఓ రామకృష్ణారెడ్డి, పత్తికొండ ఎంపీడీఓ, పత్తికొండ తహసీల్దార్, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్ లు తదితర వాటిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను సచివాలయం బయటవైపున ప్రదర్శించలన్నారు. సచివాలయంలో పరిధిలో 18 సంవత్సరాల పైబడిన వారికి ఎంత మందికి వ్యాక్సిన్ ఇచ్చారు వంటి వివరాలను ఏఎన్ఎంను అడిగి రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మీ పరిధిలోని 18 సంవత్సరాల నుంచి 45 లోపు ఉన్న వారు, గర్భవతులు అందరికీ మోటివేషన్ చేసి వ్యాక్సినేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేయాలని ఏఎన్ ఎంకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మీ వార్డు ప్రాంతంలోని మహిళలకు దిశా యాప్ పై అవగాహన కల్పించాలని మహిళా పోలీస్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తూ సచివాలయ సేవలు గురించి గురించి ఇంటింటికి తెలియజేసి ప్రజల మన్ననలు పొందాలని సచివాలయ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

సమస్యలు తీర్చేలా సచివాలయాలు పని చేయాలని, ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను ఇంటి వద్దనే అందించేందుకు సచివాలయ వ్యవస్థ అనేది చాలా కీలకమన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సచివాలయ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజల దగ్గరగా ఉంటూ మెరుగైన సేవలు అందించడంతో పాటు సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ సచివాలయ ఉద్యోగులకు సూచించారు. ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని గ్రామ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.

Back to top button