Pattikonda

పెరిగిన ఇందనం ధరలను వెంటనే తగ్గించాలి. టీడీపీ ధర్నా

పత్తికొండ (పల్లె వెలుగు ) 28 ఆగష్టు:  రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని తెలుగుదేశం పార్టీ పత్తికొండ నియోజక వర్గ ఇంచార్జి కె ఇ శ్యాంబాబు ఆదేశాల మేరకు నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతు పెరిగిన ఇందన ధరలు సామాన్య ప్రజలకు గుది బoడ గా మారాయని దీనివల్ల రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు కొనలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ధరలు తగ్గాలంటే జగన్ దిగి పోవాల్సిందేనని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు సాంబశివ రెడ్డి గారు TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు తిరుపాల్ బీసీ సెల్ రాష్ట్ర నాయకులు రామానాయుడు ,లక్ష్మీనారాయణ జిల్లా నాయకులు సోమ్లా,ఉచిరప్ప అలాగే మండల పార్టీ కార్యదర్శి సుధాకర్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button