pamulapadu

ఘనంగా జరిగిన గంగమ్మ తల్లి పూజా

పాములపాడు (పల్లెవెలుగు) 24 ఆగష్టు: మండలం వాడాల గ్రామంలో ప్రజలు అందరూ కలసి మెలసి గ్రమంలో  వానలు బాగా కురిసి, పంటలు బాగా పండాలని కోరుకుంటూ   గ్రామంలో వెలసినటువంటి  గంగమ్మ తల్లి దేవతకి పూజలు జరిపించి అదేవిదంగా గ్రామంలో ఉన్న  దేవతలందరికీ  పసుపు నీళ్లతో అభిషేకం చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ  ప్రజలు వర్షం లేక గ్రామంలో ఎంతో పంట నష్టపోతున్నారు కాబట్టి ఈ సంవత్సరం అలా జరగకుండా ఉండాలని గ్రామ దేవతల ఆశీస్సులతో వర్షాలు సకాలంలో అయిన సమయంలో కురవాలని  అలా జరిగితే రైతులందరూ చాలా బాగుంటారని వారు తెలిపారు అంతేకాకుండా ఈ రోజు పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత గ్రామంలోనూ ప్రజలందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Back to top button
Enable Notifications    OK No thanks