pamulapadu

ఉచిత కుట్టు శిక్షణ కు మహిళలు దరఖాస్తు చేసుకోండి – ఎస్ షర్ఫుద్దీన్ అలీ

పాములపాడు మండలం పల్లెవెలుగు ఆగస్టు 22: కర్నూలు జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూత్ అండ్ అఫ్ఫైర్స్ నెహ్రూ యువకేంద్ర కర్నూలు వారి ఆర్థిక సహకారంతో సేవాభారతి యుత్  రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణకు  మహిళలు దరఖాస్తు చేసుకోవాలని  సంస్థ అధ్యక్షుడు :- ఎస్ షర్ఫుద్దీన్ అలీ విలేకరుల సమావేశంలో కోరారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ స్వయం ఉపాధి శిక్షణ కు జిల్లాలోని 18 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వయసు మధ్య కలిగిన మహిళలు తాము చదువుకున్న సర్టిఫికెట్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ కాఫీలతో 2 పాస్పోర్టులు సెల్ నెంబర్ తో కూడిన పూర్తి బయోడేటాతో పాములపాడులోని కేజీ  రోడ్డు  పక్కన ఉన్న సేవాభారతి (వై ఆర్ డి ఎస్) కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు యూత్ ప్రెసిడెంట్ :9573318022, 8247725579 సెల్ నెంబర్లకు ఫోన్ చేసి కనుగొనవచ్చు ఆన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks