
కర్నూలు జిల్లా కు అనుభవమున్న మైనారిటీ సంక్షేమాదికారిని నియమించాలి
కర్నూలు జిల్లా కు అనుభవమున్న మైనారిటీ సంక్షేమాదికారిని నియమించాలి
కర్నూలు జిల్లా కు అనుభవమున్న మైనారిటీ సంక్షేమాదికారిని నియమించాలని వక్ఫ్ ప్రొటెక్షన్ ఫోరం ఆంధ్ర ప్రదేశ్ కర్నూలు జిల్లా ప్రజల నుండి తేది 29-03-2022 నుండి 31-03-2022 3 రోజుల సంతకాల సేకరణ కార్యక్రమము జరపబోతుంది ఇట్టి ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని వక్ఫ్ ప్రొటెక్షన్ ఫోరం విజ్ఞప్తి చేసారు.
ప్రస్తుత కర్నూలు జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి మహబూబ్ బాష అనుభవము మరియు అవగాహన లోపము వల్ల దానికి తోడూ ఇతని డ్యూటీ అయిన జిల్లా మైనారిటీ సంక్షేమాదికారి పోస్టుకు పై సరిగ్గా పని చయలేక పోవడం వల్ల మన కర్నూలు జిల్లా మైనారిటీలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ పథకాలు ఎన్నో కోల్పోయాము. దానికి మన కర్నూలు జిల్లా కు ఒక అవగాహన ఉన్న మరియు అనుభవమున్న మైనారిటీ శాఖాదికారిని నియమించాలని ఇట్టి ఈ విషయము పై ఇది వరకే వక్ఫ్ ప్రొటెక్షన్ ఫోరం ఈ అధికారి పై, పై అధికారులకు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కాని ఇప్పటి వరకు అతని పై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం పై వక్ఫ్ ప్రొటెక్షన్ ఫోరం ఇప్పుడు కర్నూలు జిల్లా ప్రజల నుండి సంతకాలు సేకరించి మరల ఎ.పి. ముఖ్య మంత్రి కి మరియు సంబంధిత శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరికు ఇచ్చేందుకు ఈ సంతకాల సేకరణ కార్యక్రమము తేది 29-03-2022 నుండి 31-03-2022 వరకు జరగబోతుందని ఈ సంతకాల సేకరణ కర్నూలు, ఆదోని మరియు నంద్యాల డివిజన్లలో జరుగునని ప్రజలు ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని వక్ఫ్ ప్రొటెక్షన్ ఫోరం ఎ.పి. కన్వినర్ సయ్యద్ మహబూబ్ పీర్ కోరారు.