Kurnool CityAbdul Javid

నంద్యాల నూతన జిల్లాకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను 11 కేటగిరీలుగా విభజించి నివేదికలు సిద్ధం చేయండి

నంద్యాల నూతన జిల్లాకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను 11 కేటగిరీలుగా విభజించి నివేదికలు సిద్ధం చేయండి

  • అభ్యంతరాలు, సలహాలపై ప్రత్యేక నివేదిక రూపొందించండి
  • జిల్లా శాఖల వారీగా ఉద్యోగుల జాబితా సిద్ధంగా ఉంచుకోవాలి
  • జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు

కర్నూలు మార్చి 03 (పల్లెవెలుగు) నూతనంగా ఏర్పాటు కాబోతున్న నంద్యాల జిల్లాలో విలీనమయ్యే ప్రాంతాలకు సంబంధించి జిల్లా స్థాయి అభ్యంతరాలు, సూచనల కమిటీకి 126 దరఖాస్తులు వచ్చాయని వీటిని 11 కేటగిరీలుగా విభజించి నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు సంబంధిత కమిటీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో జిల్లా స్థాయి అభ్యంతరాలు, సూచనల కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశమయ్యారు. జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామసుందర్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటసుబ్బయ్య, సిపిఓ అప్పల కొండయ్య తదితర పాల్గొన్నారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు మాట్లాడుతూ నంద్యాల నూతన జిల్లా ఏర్పాటుకు సంబంధించి ఇప్పటివరకు స్వీకరించిన 126 దరఖాస్తులను 11 కేటగిరీలుగా విభజించి నివేదికలను సిద్ధం చేయాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. ఈరోజు (గురువారం)సాయంత్రం వరకు మరిన్ని దరఖాస్తులు వస్తాయని స్వీకరించిన దరఖాస్తులన్నింటిని పూర్తిగా అధ్యయనం చేసి అభ్యంతరాలు, సలహాలపై ప్రత్యేక నివేదిక రూపొందించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా మ్యాప్ ను తయారు తయారు చేయడంతో పాటు డివిజన్… డివిజన్ సంబంధించిన అన్ని మండలాలు ఒకే కలర్ లో ఉండేలా సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి ఒక కలర్ ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. స్వీకరించిన దరఖాస్తుల్లో అభ్యంతరాలు తెలిపిన ప్రదేశం నుండి జిల్లా కేంద్రానికి ఎంత దూరం ఉంటుందో సంబంధిత దూరాన్ని కిలోమీటర్ల సహా పొందుపరచాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని డిపార్ట్మెంట్లు శాఖల వారీగా పని చేస్తున్న ఉద్యోగుల (క్యాడర్ స్ట్రెంత్) జాబితాను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సీనియర్ అసిస్టెంట్ అధికారి స్థాయి నుండి జోనల్ సీనియారిటీగా వర్తిస్తుందని కలెక్టర్ తెలిపారు

Back to top button