Kurnool CityAbdul Javid

ఇన్వెంటరీ మేనేజర్ ఉద్యోగానికి అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి నెల 1 తేదీ 3 గంటల లోగా  ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి

ఇన్వెంటరీ మేనేజర్ ఉద్యోగానికి అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి నెల 1 తేదీ 3 గంటల లోగా  ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి

జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.మనజీర్ జిలానీ సామూన్

కర్నూలు (పల్లెవెలుగు) జనవరి 30 :  ఇన్వెంటరీ మేనేజర్ ఉద్యోగానికి అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి నెల 1 తేదీ 3 గంటల లోగా ఆన్లైన్ లో  దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.మనజీర్ జిలానీ సామూన్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కార్యాలయం నందు  ఒప్పంద ప్రాతిపదికన ఇన్వెంటరీ మేనేజర్ ఉద్యోగానికి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని, ఈ పోస్టుకు అర్హత కలిగిన అభ్యర్థులు  ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనల్లో జాయింట్ కలెక్టర్ కోరారు. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత, అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లను సింగిల్ పిడిఎఫ్ ఫైల్ లో ఫిబ్రవరి 1 తేదీ మధ్యాహ్నం 3:00 లోగా  jcvwsd.spandana.knl@gmail.com ఈ మెయిల్ కు for the job of inventory manager అన్న సబ్జెక్ట్ లైన్ తో  దరఖాస్తులు పంపించాలన్నారు. ఈ నోటిఫికేషన్ ను  kurnool.ap.gov.in అనే వెబ్సైట్లో కూడా చూడవచ్చని, తద్వారా  పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని జాయింట్ కలెక్టర్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు  జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కార్యాలయం నందు ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 10:00 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందన్నారు.

వివరాలు :

  • పోస్టు : ఇన్వెంటరీ మేనేజర్
  • పదవీకాలం: కాంట్రాక్ట్ బేసిక్ మీద ఒక సంవత్సర కాలం.
  • పే స్కేల్ : రూ.20,000 నుంచి 23,000 వరకు చెల్లిస్తారు.

అర్హతలు :

1)ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత.
2)ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, ఇన్వెంటరీ సాఫ్ట్‌వేర్ తదితర కంప్యూటర్ అప్లికేషన్స్ ల యందు ఉత్తీర్ణత.
3)హార్డ్‌వేర్ పరికరాల వాడకంలో నైపుణ్యం ఉండాలి.
4)సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి.

Back to top button