Abdul JavidKurnool City

నేడే జిల్లాలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్

  • అందుబాటులో 1.50 లక్షల వ్యాక్సిన్ డోసులు
  • అన్ని సచివాలయాలు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సబ్ సెంటర్లలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహణ
  • వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి

కర్నూలు (పల్లెవెలుగు) 26 అక్టోబర్ : జిల్లాలో మంగళవారం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, జిల్లాలో 1.50 లక్షల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వ రావు అన్నారు.

సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నుంచి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ పై ఆర్ డి ఓలు, మున్సిపల్ కమిషనర్ లు, తహసీల్దార్ లు, ఎంపిడిఓలతో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ

జిల్లాలో ఇప్పటివరకు  23 లక్షల మంది మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకున్నారన్నారు. 12.28 లక్షల మంది రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్నారన్నారు. ఇంకా మొదటి, రెండు  డోసులు అసలు వేయించుకోని వారు 5 లక్షల మంది ఉన్నారన్నారు. మంగళవారం రెండవ డోసు గడువు సమీపిస్తున్న వాళ్ళు  మరియు అసలు వ్యాక్సిన్ వేయించుకొని వారందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. రేపు జిల్లాలో 1.50 లక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకొని రెండవ డోసు వ్యాక్సిన్ వేయించుకోకపోతే మొదటి డోసు వృధా అవుతుందన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.,  ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకొని మీరు, మీ కుటుంబాన్ని కోవిడ్ బారినపడకుండా కాపాడుకోవాలని జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ కోరారు.

మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను విజయవంతం చేయండి

మంగళవారం నిర్వహిస్తున్న మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను విజయవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్ లు, ఎంపీడీఓలు ప్రణాళికాబద్ధంగా  వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని ఆదేశించారు. రేపు ఉదయం ఆరు గంటలకే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక చొరవ చూపి వ్యాక్సిన్ డోసులు  ఎట్టిపరిస్థితిలో పూర్తి చేయాలన్నారు.

ప్రజలకు విజ్ఞప్తి

18 ఏళ్లు నిండి వ్యాక్సిన్ వేయించుకోని వారు, రెండవ డోసు వేయించుకోని వారు దగ్గరలో ఉన్న సచివాలయం లేదా ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎం కె వి శ్రీనివాసులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Back to top button