Abdul JavidKurnool City

అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న పాఠశాల లపై చర్యలు తీసుకోవాలని

పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు PDSU జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ ఎన్ డి రఫీ

కర్నూలు జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు మరియు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా తమ ఇష్టానుసారంగా ఫీజులను వసూళ్లు చేస్తున్నారని కర్నూలు జిల్లా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. శనివారం నాడు కడప లోని రాయలసీమ ప్రాంతీయ పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ వెంటక కృష్ణ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా  కర్నూలు PDSU జిల్లా సహాయ కార్యదర్శి రఫీ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా శ్రీ చైతన్య, భాష్యం, నారాయణ మరియు ప్రైవేట్ పాఠశాలలు తమ ఇష్టానుసారంగా ఫీజులను వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. పాఠ్య పుస్తకాలు, యూనిఫారం, మరియు స్పెషల్ ఫీజుల పేరుతో తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఒకే పాఠశాల గుర్తింపుతో మరో బ్రాంచ్ లలో అక్రమ అడ్మిషన్ లు నిర్వహిస్తు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే అలాంటి పాఠశాలలపై విచారణ జరిపించి ప్రభుత్వ నిబంధనలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగరాజు ,PYL జిల్లా కన్వీనర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Back to top button