Abdul JavidKurnool City

మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపండి

అధికారులను ఆదేశించిన చీఫ్ సెక్రటరీ సమీర్‌ శర్మ

కర్నూలు,(పల్లెవెలుగు) అక్టోబర్ 18 : అక్రమ మద్యం రవాణా, నాటుసారా తయారీకి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకొని ఉక్కుపాదం మోపాలని సెబ్ పోలీసు అధికారులను చీఫ్ సెక్రటరీ సమీర్‌ శర్మ ఆదేశించారు. సోమవారం సాయంత్రం చీఫ్ సెక్రటరీ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సెబ్ మరియు పోలీస్ శాఖ అధికారులతో చీఫ్ సెక్రటరీ సమీర్‌ శర్మ వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ లోని మిని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, ఎక్సైజ్ శాఖ సూపర్డెంట్ జి.నాగేశ్వరరావు, కమర్షియల్ టాక్స్ జాయింట్ కమిషనర్ శేషాద్రి, తదితరులు పాల్గొన్నారు. అక్రమ మద్యం, నాటుసారా నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు చీఫ్ సెక్రటరీ గారికి వివరించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా, నాటు సారా తయారీ పై ప్రత్యేక నిఘా ఉంచి… నిఘా పెట్టి అక్రమార్కుల పైన ఉక్కుపాదం మోపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇదివరకే ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో అక్రమ రవాణా జరుగుతుంది, నాటు సారా తయారీ, అమ్మకాలు తదితర వాటిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, విస్తృతంగా దాడులు నిర్వహించాలని అధికారులను ఆదేశించామన్నారు.

Back to top button