Abdul JavidKurnool City

హైకోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి  కేంద్రీకరించాలి

  • హైకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చిన 10 రోజుల్లో ఉత్తర్వులను   అమలు చేయడం, వీలు కాకపోతే అప్పీల్ కు వెళ్ళడం చేయాలి
  • స్పందన కు సంబంధించి రేపటికి గడువు దాటిన సమస్యలు ఉండకూడదు
  • సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
  • అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు

కర్నూలు, సెప్టెంబర్ 27 :జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి   పెండింగ్ లో ఉన్న  హైకోర్టు కేసులపై అధికారులు ప్రత్యేక దృష్టి  కేంద్రీకరించాలని  జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

సోమవారం సాయంత్రం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా  డిపివో,డిఎస్వో, రిజిస్ట్రేషన్, ఇరిగేషన్, డ్వామా, జడ్పీ సీఈఓ తదితర శాఖల అధికారులతో కేసుల వారీగా   పెండింగ్ లో ఉన్న హైకోర్టు  కేసులపై దాదాపు మూడు గంటల పాటు సమీక్షించారు. అనంతరం  స్పందన ఫిర్యాదుల పరిష్కారం, citizen outreach  పై  జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు సమీక్ష నిర్వహించారు.

జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.మనజీర్  జిలానీ సామూన్, జాయింట్‌ కలెక్టర్‌ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి,  నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, డి ఆర్ ఓ పుల్లయ్య,  ఆర్డీవో లు, వివిధ శాఖల జిల్లా  అధికారులు, మునిసిపల్ కమిషనర్ పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ…

హైకోర్టు కేసుల పట్ల అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.   కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చిన 10 రోజుల్లో ఉత్తర్వులను  అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తర్వులను అమలు చేయడం  వీలు కాకపోతే అప్పీల్ కు వెళ్ళడం చేయాలన్నారు.. పూర్తి వివరాలతో  కౌంటర్ ఫైల్ చేయాలన్నారు . తర్వాత రిజిస్ట్రీ లో నమోదయ్యేలా జి.పి.తో మాట్లాడి చర్యలు తీసుకోవాలన్నారు .మధ్యంతర ఉత్తర్వులు వస్తే  అమలు చేయాలన్నారు. కోర్టు ధిక్కార కేసులు నమోదు కాకుండా చూడాలన్నారు..  వచ్చే శుక్రవారానికి  హైకోర్టు పెండింగ్ కేసుల విషయంలో పరిష్కార దిశగా  పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

స్పందన కు సంబంధించి గడువు దాటిన సమస్యలు ఇంకా 91 ఉన్నాయని,  రేపటికి గడువు దాటిన సమస్యలు ఉండకూడదన్నారు. రెవెన్యూ శాఖ నుండి 31, గ్రామ ,వార్డ్ సచివాలయాల్లో 31, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ నుండి 13 ,ఇంకా ఇతర శాఖల  జిల్లా అధికారుల నుండి  సింగిల్ డిజిట్ లో గడువు దాటిన సమస్యలు ఉన్నాయన్నారు.  జిల్లా అధికారులు వెంటనే గడువు దాటిన స్పందన సమస్యలన్నీ పరిష్కరించాలని, లేకపోతే కలెక్టరేట్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూం కు జిల్లా అధికారులు హాజరై పరిష్కారమయ్యే లా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు . ఎంపీడీఓ లు,  మునిసిపల్ కమిషనర్ లు ఈరోజు రాత్రికి citizen out reach ప్రోగ్రామ్ పూర్తి చేయాలన్నారు.

రేపు 3 లక్షల కొవిడ్ వ్యాక్సిన్  జిల్లాకు రానుందని, మూడు రోజుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.. జాయింట్ కలెక్టర్ లు, సబ్ కలెక్టర్ , ఆర్డీవో లు, జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. సీజనల్ వ్యాధులు గ్రామాలకు వ్యాపిస్తున్నాయని, నిరంతరం లార్వా నియంత్రణ చర్యలు, పారిశుధ్య చర్యలు చేపట్టాలనీ డిపివో, డిఎంహెచ్వోను ఆదేశించారు..  డివిజనల్ పంచాయతీ అధికారులతో సమీక్ష చేయాలన్నారు.. పంచాయతీ సెక్రటరీ లు, ఈ వో పిఆర్డీ లు పని చేసేలా చూడాలన్నారు. చిన్న పిల్లలు చనిపోతున్నారని పత్రికల్లో వచ్చే వార్తలు చూస్తే చాలా బాధగా ఉందన్నారు..సీరియస్ గా పని చేసి కేసులు తగ్గించక పోతే  చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.. వైద్యారోగ్య అధికారులతో సమీక్ష నిర్వహించాల్సిందిగా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కి సూచించారు

Back to top button