
అక్రీడిటేషన్ సాధన దీక్షకు మద్దతు తెలిపిన ఆర్.జేఏసీ నాయకులు
కర్నూలు (పల్లెవెలుగు) ఆగస్టు 25 కర్నూలు నగరంలో స్థానిక శ్రీకృష్ణ దేవరాయలు సర్కిల్ దగ్గర రాయలసీమ జర్నలిస్ట్స్ ఫోరం నాయకులు చేపట్టిన దీక్ష కార్యక్రమానికి ఆర్.జేఏసీ చైర్మన్ రవికుమార్, కన్వీనర్లు సీమకృష్ణ, రంగముని నాయుడు, నాయకులు అశోక్ పాల్గొని మద్దతు తెలిపి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్ట సమయంలో ప్రభూత్వంనుండి వచ్చే వార్తలను ప్రజలకు,ప్రజల కష్టాలను ప్రభూత్వాలకు తెలుపుతూ ప్రజలకు ప్రభూత్వానికి మధ్య వారధిలా పనిచేసారని వారి సేవలకు గుర్తింపునివ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అక్రీడిటేషన్ ఇవ్వకుండా జీవో 142ను తీసుకురావడమన్నది మంచి నిర్ణయం కాదనీ నాడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి రావడానికి ఈ స్ధానిక పత్రికల పాత్ర లేదా అని ప్రశ్నించారు. స్థానిక ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టటం వలనే ప్రజలలో మార్పు కనిపించిందని గుర్తుచేసారు నేడు జర్నలిస్టుల సేవలను మరచి వారి జీవనాధారం పై దెబ్బకొట్టడం అన్యాయమని ప్రభూత్వ ప్రకటనలు స్థానిక పత్తికలకు ఇచ్చి ప్రోత్సహించాలని ఇప్పటికైనా అక్రీడిటేషన్ జర్నలిస్టుల హక్కుగా భావించి వారికి అక్రీడిటేషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.