Abdul JavidKurnool City

జర్నలిస్టుల పట్ల జగన్ సర్కారు మొండి వైఖరి తగదు

జీఎస్టీ తో సంబంధం లేకుండా అక్రి డి టేషన్ లు మంజూరు చేయాలి జర్నలిస్టుల పోరాటానికి సంపూర్ణ మద్దతు: అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ స్పష్టం

కర్నూలు (పల్లెవెలుగు) ఆగస్టు 25: ఆంధ్రప్రదేశ్ లోని  జర్నలిస్టుల పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశంగా మొండి వైఖరితో వ్యవహరిస్తోందని అన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ విమర్శించారు. స్థానిక పత్రికల విలేకరుల పట్ల జగన్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక పత్రికలజర్నలిస్టులు అభద్రతాభావంతో ఆందోళనకు దిగార నీ,వీరందరికీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ జర్నలిస్టుల పోరాటాలకు మద్దతుగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు .బుధవారం కర్నూలులో అక్రిడిటేషన్ ల సాధన కోసం జర్నలిస్టు బత్తిన నవీన్ ఆధ్వర్యంలో రాయలసీమ జర్నలిస్టుల ఫోరం చేపట్టిన రిలే నిరాహార  దీక్ష శిబిరాన్ని అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ సందర్శించి సంఘీ భావాన్ని తెలి పి, మద్దతు గా ప్రసంగించారు. జగన్ ప్రభుత్వం జర్నలిస్టుల మనుగడకు ముప్పు వాటిల్లే విధంగా తీసుకొచ్చిన 142 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని స్థానిక పత్రికల జర్నలిస్టులకు ,కేబుల్ ఛానల్ ల  విలేక ర్లందదరికీ  జిఎస్టి తో సంబంధం లేకుండా, ఎమ్ ఎస్ వో  ప్ర సారాలతో సంబంధం లేకుండా అ క్రిడిటేషన్ లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విలే కర్లందరికీ ఈ ఏడాది అక్రిడిటేషన్ లు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 20ఏళ్ల సీనియారిటీ కలిగిన విలేకర్లందరికీ పత్రికలు, వయసుతో సంబంధం లేకుండా ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. ఏపీలోని జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించి, కరోనా తో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను వెంటనే ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని  డిమాండ్ చేశారు. 50 ఏళ్లు నిండిన సీనియర్ జర్నలిస్టులందరికీ వెటరన్ జర్నలిస్టు గా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని అబ్దుల్ సత్తార్ డిమాండ్ చేశారు. జర్నలిస్టుల పై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న జగన్ సర్కార్ త్వరలోనే  మనుగడ కోల్పోవడం  ఖాయం అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు చేస్తున్న పోరాటాలకు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా నిలుస్తుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు శ్రేణులు జర్నలిస్టుల పోరాటాలకు మద్దతుగా నిలుస్తారని అబ్దుల్ సత్తార్ ప్రకటించారు.

Back to top button
Enable Notifications    OK No thanks