
దామోదరం సంజీవయ్య స్మారక మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
- దామోదరం సంజీవయ్య స్మారక మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలను మనబడి నాడు- నేడుతో అద్భుతమైన పాఠశాలగా తీర్చిదిద్దండి
- పాఠశాలలో మొక్కల పెంపకంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించండి
- కర్నూలు నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్, డీఈఓ సాయిరాంను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు
కర్నూలు (పల్లెవెలుగు) ఆగస్టు 21: ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చదివిన పాఠశాలను మనబడి నాడు -నేడు పధకం కింద దామోదరం సంజీవయ్య స్మారక మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలను అన్ని వసతులతో అద్భుతమైన పాఠశాలగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్, డీఈఓ సాయిరాంను ఆదేశించారు.
శనివారం కర్నూలు నగరంలోని దామోదరం సంజీవయ్య స్మారక మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు
దామోదరం సంజీవయ్య స్మారక మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో చుట్టుపక్కల ఉన్న ఆవరణలను నిశితంగా పరిశీలించారు. ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేకంగా షెడ్డు ఏర్పాటు చేయాలని, పాఠశాలలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నారు. పాఠశాలలో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించి డ్రిప్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలన్నారు జిల్లా కలెక్టర్ వెంట కర్నూల్ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర్, డిఈఓ సాయిరాం, తదితరులు పాల్గొన్నారు