Abdul JavidKurnool City

మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడండి

  • మహిళా సంఘాలు తయారు చేసే వివిధ ఉత్పత్తులను జిల్లాలోని వివిధ సంక్షేమ వసతి గృహాల సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేయండి
  • మెప్మా ద్వారా కొత్త ఎస్ హెచ్ జి పొదుపు సంఘాలను ఏర్పాటు చేయండి
  • నిరాశ్రయులకు ఆశ్రమం కల్పించే సెంటర్లపై పెద్ద ఎత్తున ప్రచారం కల్పించండి
  • నిరుద్యోగుల ఉపాధి కల్పనే ధ్యేయంగా పని చేయండి
  • సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు

కర్నూలు (పల్లెవెలుగు)  ఆగస్టు 17 : జిల్లాలో ఉపాధి మరియు మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతూ జీవనోపాదుల కల్పించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరావు ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో డిఆర్ డిఎ, మెప్మా, స్కిల్ డెవలప్మెంట్ & ఐటిఐ, డిస్ట్రిక్ ఎంప్లాయిమెంట్, సేట్కూరు సీఈఓ, ఎండోమెంట్, డిస్ట్రిక్ కో ఆర్డినేటర్ రెసిడెన్షియల్ స్కూల్ ఎస్సి, బిసి అధికారులతో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు సమీక్ష నిర్వహించారు.

సమీక్షలో జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, డి ఆర్ డిఎ పిడి వెంకటేశులు, ఏపీడి శ్రీధర్ రెడ్డి, మెప్మా పిడి శిరీష, సేట్కూరు సీఈఓ నాగరాజు నాయుడు, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు నాయుడు, జిల్లా ఉపాధి కల్పనాధికారి రమాదేవి, నైపుణ్యాభివృద్ధి సంస్థ కోఆర్డినేటర్ విన్సెంట్, రెసిడెన్షియల్ స్కూల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీదేవి, తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు మాట్లాడుతూ….మహిళా సంఘాలు తయారు చేసే వివిధ ఉత్పత్తులను జిల్లాలోని వివిధ సంక్షేమ వసతి గృహాలకు సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేయాలని డిఆర్డిఎ పిడిను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కర్నూలు జిల్లాలో మహిళల ఉత్పత్తి చేసిన ఉత్పాదకాలను అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మల్టీ నేషనల్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు చర్యలు చేపట్టాలని డిఆర్డిఎ పిడిను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయంతో మహిళలు ఆర్థికంగా ఎదిగేలా చూస్తూ సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమానికి పెన్షన్ అర్జీలు ఇస్తున్నారని, వాటిలో అర్హులైన పెన్షన్ దారులను గుర్తించి… మీకు వచ్చిన ప్రతి అప్లికేషన్ ను వెరిఫై చేసి వారికి బాసటగా నిలవాలని జిల్లా కలెక్టర్ డిఆర్డిఎ పిడిను ఆదేశించారు. మెప్మా ద్వారా కొత్త ఎస్ హెచ్ జి పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని మెప్మా పిడిను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నిరాశ్రయులకు ఆశ్రమం కల్పించే సెంటర్లపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని మెప్మా పిడిను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. టిడ్కో గృహాల లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా సమన్వయం చేసుకొని రుణాలు ఇప్పించాలని మెప్మా పిడిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా పని చేయాలని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ కోఆర్డినేటర్ లకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ట్రైనింగ్ తో పాటు ఉపాధి అవకాశం కూడా కల్పించాలన్నారు. ఎంప్లాయిమెంట్ జనరేట్ అయ్యేలా ప్రముఖ పాత్ర పోషించాలని శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వివిధ కంపెనీలతో ట్రైనింగ్ ఇప్పించి ఉపాధిని కల్పన కోసం కృషి చేయాలన్నారు. ఐఐటీ / నీట్ విద్యార్థులను ప్రోత్సహించి అత్యుత్తమ ఫలితాలు సాధించేలా… చూస్తూ ఉన్నత చదువులు… మంచి విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని రెసిడెన్సి స్కూల్ కో ఆర్డినేటర్ శ్రీదేవిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. లక్ష్మీపురం గురుకుల పాఠశాలకు తాగునీటి సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జగన్నాథ గట్టులో ఉన్న గురుకుల పాఠశాలకు అప్రోచ్ రోడ్డు వేసేందుకు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అంతకుమునుపు శాఖ వారీగా సుదీర్ఘంగా ఆయా శాఖల ప్రగతి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తదితర వాటి పై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

Back to top button
Enable Notifications    OK No thanks