Abdul JavidKurnool City

సి ఎం . వై యస్ జగన్ మోహన్ రెడ్డి కీ కృతఙ్ఞతలు

ఆంధ్ర ప్రదేశ్ లోని వక్ఫ్ ఆస్తులను కాపాడటానికి మరియు మరియు అట్టి వక్ఫ్ ఆస్తులు యావత్ ఆంధ్ర ప్రదేశ్ లోనే కర్నూలు జిల్లా లోనే ఎక్కువగా ఉండడం పై కర్నూలు లోనే వక్ఫ్ ట్రిబ్యునల్ ను ఏర్పాటు చెయ్యాలని వక్ఫ్ ప్రొటెక్షన్ ఫోరమ్ గత 2018 నుండి పోరాడుతున్న విషయము మీ అందరికి తెలుసు గత మరియు ప్రస్తుత  ఎం.ఎల్.ఏ. లకు మంత్రులకు ముఖ్య మంత్రులకు సంబంధిత అధికారులకు మరియు వక్ఫ్ బోర్డు అధికారులకు కూడా ఎన్నో విన్నపాలు ఇవ్వడం జరిగింది.   దీనిపై  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ ఆంధ్ర ప్రదేశ్ లోని వక్ఫ్ ఆస్తులను కాపాడటానికి తీవ్రంగా అడుగులు ముందుకు వేస్తున్నారు అలాగే కర్నూలు లో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకై కూడా అధికారులను ఆదేశించారన్న వార్తా పై వక్ఫ్ ప్రొటెక్షన్ ఫోరమ్ రాష్ట్ర కన్వీనర్ సయ్యద్ మహమూద్ పీర్ మరియు  ముస్లిం సోదరులు ఆయన్ను అభినందించారు. గతములో ఏ ముఖ్య మంత్రి వక్ఫ్ బోర్డు పై ఇంత  దృష్టి సారించలేదని ఈ  సారి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి వక్ఫ్ బోర్డు పైడ్ దృష్టి సారించి అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను తిరిగి వక్ఫ్ బోర్డు కు చేర్పిస్తారన్న  ఆశ ముస్లిం సోదరుల్లో కలిగింది దీనికి నిదర్శనం అన్యాక్రాంతమైన 500  ఎకరాల వక్ఫ్ భూమిని తిరిగి స్వాధీనపరుచుకోవడం.  ఏది ఏమైనా దీనికి కృషి చేసిన అందరి ఎం.ఎల్.ఏ లకు మంత్రులకు వక్ఫ్ సి.ఈ.ఓ  మరియు సంబంధిత అధికారులకు  కూడా వక్ఫ్ ప్రొటెక్షన్ ఫోరమ్ తరుపున కృతఙ్ఞతలు తెలియజేసుకుంటూ అన్యాక్రాంతానికి గురైన అన్ని వక్ఫ్ ఆస్తులను ఈ ప్రభుత్వం స్వాధీన పరిచి దీనిని తిరిగి వక్ఫ్ బోర్డు కు ఇస్తుందన్న నమ్మకాన్ని అలాగే ఉంచుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు

Back to top button
Enable Notifications    OK No thanks