kodumuru

కోట్ల ఇంటి ముందు వీరంగం

కోడుమూరు : కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాఽధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి స్వగ్రామం లద్దగిరిలోని నివాసం ముందు శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. అల్లినగరానికి చెందిన బుర్రుకుంట లక్ష్మన్న అనే వ్యక్తి తప్పతాగి బైక్‌పై కోట్ల ఇంటి ముందుకు వచ్చాడు. లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించాడు. పేరుతో సంబోధిస్తూ బయటకు రావాలని కేకలు వేశాడు. అలజడి విన్న చుట్టుపక్కల కార్యకర్తలు అక్కడకు చేరుకుని తాగుబోతును అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ వేణుగోపాల్‌ సిబ్బందితో వెళ్లి పరిస్థితి విచారిస్తున్నారు. మండల కన్వీనర్‌ కోట్ల కవితమ్మ అక్కడికి చేరుకున్నారు. కర్నూలుకు వెళ్లిన సుజాతమ్మ తన నివాసానికి చేరుకున్నారు.

Back to top button