holagunda

AISF పోరాట ఫలితంగా  ఆలూరు సులువాయి మీదుగా హోళగొందకు విద్యార్థి బస్సు

స్పందించిన ఆర్టీసీ (DM) డిపో మేనేజర్ గారికి AISF మండల కార్యదర్శి శ్రీరంగ విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు

హోళగుంద  (పల్లె వెలుగు) AISF పోరాట ఫలితంగా  ఆలూరు సులువాయి మీదుగా హోళగొందకు విద్యార్థి బస్సు  ఈ సందర్భంగా AISF మండల కార్యదర్శి శ్రీరంగ మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుంచి విద్యార్థులతో కలిసి AISF మండల నాయకులు విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయం మండల విద్యాధికారి కార్యాలయం ముట్టడించి తమకు ఉదయం పూట కూడా బస్సు నడపాలని  కేవలం సాయంత్రం పూట ఒక్కటే వస్తుంది కాబట్టి మాకు పాఠశాలకు కళాశాలకు రావడానికి చాలా ఇబ్బందిగా ఉందని ఉదయం సాయంత్రం విద్యార్థి బస్సు సరైన సమయానికి నడపాలని అలాగే ఆదోని డిపో మేనేజర్ దగ్గరికి కూడా విద్యార్థుల సమస్యలు AISF మండల కార్యదర్శి శ్రీరంగ  తీసుకెళ్లి పరిష్కరించే విధంగా డిపో మేనేజర్కు చెప్పడం జరిగింది.  డిపో మేనేజర్ కూడా సానుకూలంగా స్పందించి శ్రీరంగ  రెండు మూడు రోజుల్లో బస్సు నడుపుతామంటూ హామీ ఇవ్వడం జరిగింది. తమకు సోమవారం నుండి బస్సు రావడంతో విద్యార్థులు సంతోషంగా ఉన్నారని బస్సు సమస్య పరిష్కరించేందుకు డిపో మేనేజర్ AISF నాయకులకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారన్నారు.  అదేవిధంగా డిపో మేనేజర్ AISF నాయకులకు స్పందించినందుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో AISF నాయకులు గాదిలింగ సతీష్ శివ విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button