holagunda

గ్రామంలో శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కి భూమి పూజ

  • శ్రీ వాల్మీకి విగ్రహ స్థలం దాతలు పూజారి ఈరన్న పూజారి సుంకయ్య
  • ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్లార్తి ప్రజాసేవకుడు మల్లికార్జున

హోళగుంద మండలం “పెద్దహ్యాట గ్రామంలో”రామాయణ సృష్టికర్త శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు రాజయ్య స్వామి­ అర్చకులతో శ్రీ వాల్మీకి మహర్షి  చిత్రపటానికి పూలమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట భూమి పూజ ఎల్లార్తి ప్రజా సేవకుడు మల్లికార్జున చేతుల మీదగా  శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కి భూమి పూజ చేయించడం జరిగింది అనంతరం శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. వాల్మీకి యూత్ నాయకులు శ్రీరంగ వీరేష్ రాము మల్లయ్య మాట్లాడుతూ రామాయణ సృష్టికర్త శ్రీ వాల్మీకి మహర్షి  ఆయన లేకపోతే రామాయణమే లేదు అంతటి గొప్ప వారు వాల్మీకి మహర్షి అని వారు అన్నారు. కాబట్టి ఆయన మన వాల్మీకి  కావడం మనం ఎన్నో జన్మలు చేసుకున్న అదృష్టం అని కొనియాడారు అదే విధంగా కులవృత్తి లేని ఏకైక కులం ఏదైనా ఉంది అంటే అది కేవలం బోయ వాల్మీకిలు కాబట్టి బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వాల్మీకి జయంతి సందర్భంగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ వాల్మీకి పెద్దలు రంగస్వామి అంజని మారెప్ప కట్టే నాగప్ప డీలర్ మల్లికార్జున పాండురంగ ఏరిస్వామి పెద్ద నాగరాజ్ విరుపాక్షి సీతయ్య శేకయ్య వాల్మీకి యూత్ నాయకులు రామలింగప్ప రాము నాగప్ప కట్టే వీరేష్ ఆటో మల్లయ్య శ్రీరంగ ముది గోపాల్  వీరభద్ర వీరేష్ నాగేష్ శివప్ప  నారాయణ ఎల్లార్తి అర్జున్ తిమ్మప్ప చంద్ర రమేష్ మహేష్ ఈరన్న వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button