holagunda

ఈ నెల 27న భారత్ బంద్ ను జయప్రదం చేయండి – AISF, SFI

హోళగుంద (పల్లె వెలుగు) 25 సెప్టెంబర్: హోళగుందలో స్థానిక తనుజ డిగ్రీ కళాశాలలో విద్యార్థి సంఘాలు AISF SFI ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా CPM మండల కార్యదర్శి వెంకటేష్ CITU నాయకుడు నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా AISF మండల కార్యదర్శి శ్రీరంగ SFI జిల్లా సమితి సభ్యుడు మల్లికార్జున మాట్లాడుతూ నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను  భర్తీ చేయాలని పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర  ధరలు తగ్గించాలని ఈ నెల 27వ తేదీన భారత్ బంద్కు హోళగుంద విద్యార్థి సంఘాలు  AISF.SFI గా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం నాడు దేశంలో నిరుద్యోగ రేటు 2019 ఫిబ్రవరిలో 7.2 శాతంగా ఉన్నది కోవిడ్ నేపథ్యంలో ఇప్పుడు నిరుద్యోగుల మరింతగా పెరిగిపోయింది కడుపు మండి మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా బందులో  పాల్గొనాలని.దేశంలో నూతన విద్యా విధానం తీసుకురావడం వల్ల విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని వారు మండిపడ్డారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి CPM మండల కార్యదర్శి వెంకటేష్ CITU నాయకుడు నాగరాజ్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రైతులను అభివృద్ధి చేస్తాము అని చెప్పి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చి దానికి వ్యతిరేకంగా ఇప్పుడు మూడు నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది బిజెపి అధికారంలోకి వచ్చిన ఏళ్లలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి 30 లక్షల కోట్ల రూపాయలు అదనంగా నిండింది 1947 నుండి 2014 వరకు 52 లక్షల కోట్లు దేశం అప్పు చేయగా మోడీ ప్రభుత్వం ఏడేళ్లలో 61 లక్షల కోట్ల అప్పుచేసింది దేశంలో అప్పును 113 లక్షల కోట్లకు పెంచింది ఇది చాలా ప్రభుత్వ ఆస్తులను లక్ష కోట్లు ఖర్చు చేసింది ఇప్పుడు రోజువారీ ఖర్చుల కోసం నాలుగేళ్లలో ఆరు లక్షల కోట్లకు దేశం పేరు నా 30 ఏళ్ల నుండి 99 కార్పొరేట్లకు లీజుకు ఇవ్వడం విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గం అని వారు మాట్లాడడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ప్రైవేటీకరణ ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని లేని పక్షాన రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి పెడతామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో AISF SFI నాయకులు కాకి గాదిలింగ సతీష్ పురుషోత్తమ తదితరులు పాల్గొన్నారు

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button