
హోళగుంద లో AISF శిక్షణ తరగతుల కరపత్రాలు విడుదల
AISF 48 వ.రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయండి
హోళగుంద ( పల్లె వెలుగు) 16 సెప్టెంబర్: ఈ నెల 22 నుండి 26 వరకు ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో జరిగే AISF రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని హోళగుంద స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో కలిసి AISF రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల కరపత్రాలు విడుదల చేసిన “AISF మండల కార్యదర్శి శ్రీరంగ” ఈ సందర్భంగా AISF మండల కార్యదర్శి శ్రీరంగ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులకు ఏఐఎస్ఎఫ్ నాయకులు కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటినప్పటికీ విద్యకు పెద్దపీట వేస్తామని గొప్పలు పలుకుతూ షో చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు, నూతన విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టడం వలన విద్యను మరింత అభివృద్ధి చేయొచ్చని రాష్ట్ర ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతున్నారు తప్ప వాటి వలన గ్రామీణ స్థాయిలో పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేసేటటువంటి కుట్రని పేర్కొన్నారు, నూతన విద్యా విధానాన్ని అమలు చేయడం వలన రాష్ట్రంలో దాదాపు 30 వేలకు పైబడిన ప్రభుత్వ పాఠశాలలో మూతపడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు, ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామనే ముసుగులో కార్పొరేట్,ప్రైవేట్ విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము కాస్తుందని తెలియజేశారు, ప్రభుత్వ పాఠశాలలు మూసివేసే కుట్రలో భాగంగానే ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ లో ఒక డిఎస్సి ఉద్యోగం కూడా లేకపోవడమే దానికి నిదర్శనం అన్నారు, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోడీ బిజెపి ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టినప్పటికీ ప్రభుత్వ విద్యను ఒకవైపు విచ్ఛిన్నం చేస్తూనే, మరోవైపు ఎన్నికల ముందు యువతకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన అనంతరం దాని ఊసే ఎత్తకపోవడం చాలా బాధాకరమన్నారు, ఇటువంటి అనేక అంశాలపైన కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యావ్యతిరేక విధానాలపై, యువతను నమ్మించి మోసం చేసినవంటి విధానాలపైనా సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించేందుకు రాష్ట్రస్థాయిలో విద్యార్థులు, యువతతో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో AISF నాయకులు శివ, గోవిందు ఈరన్న, ఖాజా, ఖాసిం, హుసేని, సర్దార్, మహేష్, వీరభద్ర, విద్యార్థులు శివశంకర్, దేవరాజ్, మల్లి, రాజు, బసవరాజు పాల్గొన్నారు