Devanakonda

తాసిల్దార్ ఇంద్రాణి పై కేసు నమోదు

  • తాసిల్దార్ ఇంద్రాణి పై కేసు నమోదు
  • విఆర్వో తిక్క ఈరన్న మరియు  పెద్ద నర్సన్న నర్సి ల అరెస్ట్

 పి కోటకొండ  గ్రామానికి చెందిన కనుగొండ్ల గిడ్డయ్య పిర్యాదు మేరకు… అతని తల్లిదండ్రులు 251/1  & 251/3 సర్వేనెంబర్లలో ని 12.58 ఎకరాల భూమిని 1991 లో కొని, అప్పటి నుండి సాగు లో ఉన్నారని, తర్వాత నరసయ్య ఆరు మంది కుమారులు కూడా ఇప్పటికీ  సాగులో ఉన్నారని, మ్యాన్యువల్ అడంగల్ మరియు వన్ బి  లలో కూడా వారి తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయని, తరువాత  ఆన్లైన్ ప్రాసెస్ లో భాగంగా  నోషనల్ ఖాతాలో వారి పొలాలు “మిగులు భూములు” గా ఉండడం వలన… ఇదే అదనుగా భావించి అప్పటి దేవనకొండ తాసిల్దార్ ఇంద్రాణి, పి. కోటకొండ గ్రామానికి చెందిన కులుమాల నర్సి తనకు అనుకూలమైన వారి పేర్లను ఎటువంటి ఆధారాలు లేకుండా ఎక్కించి, తర్వాత వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు రిజిస్టర్ చేసుకోవడానికి డిజిటల్ కీ సిగ్నేచర్ తో సహకరించారని, దీనిలో  సుమారు 10 లక్షలు చేతులు మారాయి అనే ఆరోపణలతో ఫిర్యాదు రాగా  ఎస్పీ ఉత్తర్వుల మేరకు తాసిల్దార్ ఇంద్రాణి తో సహా తొమ్మిది మందిపై  కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా విఆర్వో తిక్క ఈరన్న మరియు పి కోటకొండ కు చెందిన కులుమాల నర్సన్న అలియాస్ నర్సి లను అరెస్టు చేయడం జరిగింది. మిగతా వారు పరారీలో ఉన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button
Enable Notifications    OK No thanks