Devanakonda

పందికోన రిజర్వాయర్ కుడికాల్వ సాగునీటి కోసం

పందికోన రిజర్వాయర్ కుడికాల్వ సాగునీటి కోసం

దేవనకొండ (పల్లెవెలుగు) 16 ఫెబ్రవరి: మండలానికి సంబంధించిన పందికోన రిజర్వాయర్ కుడి కాలువ ద్వారా సాగునీటిని ఏప్రిల్ 15 దాకా కాల్వ ద్వారా వదలాలని దేవనకొండ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది.  ఇప్పటికిప్పుడు సాగునీరు నిలుపుదల చేయడం వల్ల వేల రైతులు నష్టపోయి కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని ఇదే జరిగితే రైతులకు ఆత్మహత్యలు శరణ్యమని అభిప్రాయపడ్డారు. ఈ నీటిని నిలుపుదల చేస్తే ఆలూరు తాలుక తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపడతామని అలాగే సమయం సందర్భం లేని విద్యుత్ కోతల వలన కూడా రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని విద్యుత్ కోతలు ఇలాగే కొనసాగితే సబ్స్టేషన్లో ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల కన్వీనర్ విజయ భాస్కర్ గౌడ్ ఉచ్చిరప్ప,  బడి గింజల రంగన్న, మాజీ ఎంపిటిసి  వీరిష్, డీలర్ బండ్లయ్య, రాజా సాహెబ్, రామారావునాయుడు, వెలమకుర సర్పంచ్ భాస్కర్, మల్లికార్జున్ గౌడ్, పొట్లపాడు వెంకటేష్ , ఎంపీటీసీ తిమ్మప్ప, మస్తాన్,tnsf పెద్దయ్య, tnsf తాలకు సిద్దప్ప, ఆలారదెన్ని రాఘవేంద్ర, రాజశేఖర్ గౌడ్, రాజగోపాల్ గౌడ్, భూసల లక్ష్మన్న, బడే సాహెబ్,  సుభాన్, మాల బాండ్లయ్య, నాగేశ్వర రావు, కార్యక్రమంలో  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button