
కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాని కి నిరసనగా సీపీఎం-సిఐటిల ఆధ్వర్యంలో రాస్తారోకో
కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాని కి నిరసనగా సీపీఎం-సిఐటిల ఆధ్వర్యంలో రాస్తారోకో
దేవనకొండ (పల్లె వెలుగు) 2 ఫెబ్రవరి: దేవనకొండ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు చేసిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం , సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించారు సిపిఎం మండల నాయకులు పరమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లాకార్యదర్శి వర్గ సభ్యులు బీ రామాంజనేయులు జిల్లా కమిటీ సభ్యులు వీరశేఖర్. మాట్లాడుతూ లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి మొండిచెయ్యి చూపించిందిఅన్నారు ప్రత్యేకహోదా, ఇతర విభజన హామీల ప్రస్తావన పూర్తిగా విడిచిపెట్టింది అన్నారు రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే ఏ ప్రాజెక్టులూ కూడా ఇవ్వలేదు. విశాఖ రైల్వే జోను, కడప ఉక్కు, రామాయపట్నం పోర్టు, పోలవరం నిర్వాసితుల సమస్యలను బిజెపి ప్రభుత్వం గాలికొదిలేసిందిఅన్నారు. జిఎస్టి పరిహారాన్ని మరో ఐదేళ్ళపాటు కొనసాగించాలన్న రాష్ట్రాల విజ్ఞప్తిని పట్టించుకోలేదు. పోలవరం ప్రాజెక్టుకు విడుదల చేయవలసిన నిధుల గురించికనీసం మాట్లాడలేదని విమర్శంచారు రాష్ట్రంలో చేపట్టి పూర్తి చేయవలసిన కేంద్ర విద్యా, వైద్య సంస్థల గురించి, మెట్రో రైట్ ప్రాజెక్టు గురించి ఏమీ చెప్పనేలేదు. మొత్తంగానేఈ బడ్జెట్ లో మన రాష్ట్రం పూర్తిగా నిర్లక్ష్యానికి, వివక్షతకు గురైంది. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, కార్పొరేట్లకు దేశ సంపదను కట్టబెట్టేదిగా ఉందిఅన్నారు ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్ను రాష్ట్ర ప్రజలందరూ తిరస్కరించాలని విజ్ఙప్తిచేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు సిఐటియు నాయకులు నాగేష్ ,అశోక్, సూరి సంజన, రంగన్న నాగేంద్ర, సురేంద్ర మల్లయ్య గోవిందు రాముడు రంగడు రాయుడు, భాష తిప్పన్న తదితరులు పాల్గొన్నారు