
నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు
- నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు
- రాష్ట్రానికి భవిష్యత్తు నాయకుడు “నారా లోకేష
- దేవనకొండ టిడిపి పార్టీ ఆఫీస్
దేవనకొండ (పల్లె వెలుగు) 23 జనవరి: దేవనకొండ టిడిపి మండల కన్వీనర్ విజయ్ భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా టిడిపి నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తండ్రి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఆదర్శంగా తీసుకొని పార్టీ బలోపేతంనకు కృషి చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటున్నారని నవ్యాంధ్రకు భవిష్యత్తు నాయకుడని కొనియాడారు. 2024 ఎన్నికల్లో నారా లోకేష్ బాబు సారథ్యంలో చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి గా చేయడానికి ప్రతి కార్యకర్త అహర్నిశలు శ్రమించాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు .ఉచ్చిరప్ప, రామారావు నాయుడు, డీలర్ బండ్లయ్యా, మల్లయ్య, మల్లికార్జున గౌడ్, తెలుగు యువత నాయకుడు రాజ్ సాహెబ్, పొట్లపాడు వెంకటేశు, రాజశేఖర్ గౌడ్, తిమ్మప్ప, బడేసాహెబ్ ,చిన్న రాముడు, రాజశేఖర్ గౌడ్ ,రాజగోపాల్ గౌడు , నాగరాజు గౌడు , రాఘవేంద్ర, పొట్లపాడు సుధాకర్, నరసింహ గౌడ్, ఈ కార్యక్రమంలో తదితరులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు