Devanakonda

నిస్వార్ధ కమ్యూనిస్టు కామ్రేడ్ ఎ.బి బర్దన్ 6వ వర్ధంతి. సిపిఐ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు

నిస్వార్ధ కమ్యూనిస్టు కామ్రేడ్ ఎ.బి బర్దన్ 6వ వర్ధంతి. సిపిఐ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు

దేవనకొండ (పల్లె వెలుగు) 02జనవరి: దేవనకొండ సిపిఐ కార్యాలయం నందు సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అగ్రనాయకులు కామ్రేడ్ AB.బర్దన్ 6వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి సిపిఐ సీనియర్ నాయకులు తిమ్మప్ప, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎమ్.నరసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని విస్తరింపజేసేందుకు అనేక ఉద్యమాలు చేసినారన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు చేసినారన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శిగా, ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శిగా, ప్రజా ప్రతినిధిగా మహారాష్ట్ర లోని నాగపూర్ శాసనసభ్యునిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారన్నారు. మహా నాయకుడు కామ్రేడ్. AB బర్దన్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల నాయకులు నెట్టేకల్, వెంకటేశ్వర్లు, రామంజి,కృష్ణ, రంగస్వామి,శ్రీనివాసులు, ఏఐవైఎఫ్ జిల్లా కమిటీ సభ్యుడు రవికుమార్, కార్పెంటర్ యూనియన్ నాయకులు సుల్తాన్, తదితరులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button