Devanakonda

రోడ్లు, కాలువలు శుభ్రంగా ఉంచి సీజనల్ వ్యాధులు నుండి కాపాడాలి

రోడ్లు, కాలువలు శుభ్రంగా ఉంచి సీజనల్ వ్యాధులు నుండి కాపాడాలి

పంచాయతీ సర్వసభ్య సమావేశం లో సర్పంచ్ కు సీపీఐ, రైతుసంఘం వినతి

దేవనకొండ (పల్లె వెలుగు) 29 డిసెంబర్: గ్రామంలో రోడ్లు, కాలువలు శుభ్రంగా ఉంచి సీజనల్ వ్యాధులు నుండి కాపాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ, ఆంద్రప్రదేశ్ రైతుసంఘం కోరింది. దేవనకొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ లక్ష్మీ దేవి కి పంచాయతీ కార్యదర్శి రఫీకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.జగదీష్, సీపీఐ మండల సహాయ కార్యదర్శి  వెంకటేశ్వరరెడ్డి రైతుసంఘం కార్యదర్శి శివశంకర్ లు మాట్లాడుతూ గ్రామంలో కాలువలు శుభ్రం చేసి, బ్లీచింగ్ పౌడర్ ని చల్లడం లేదని అన్నారు. గ్రామంలో రెండు చెరువులు, సంజీవయ్య సాగర్ నుండి బండగట్టు వాటర్ స్కీమ్ ద్వారా త్రాగునీరు నిత్యం సరఫరా అవుతున్న గ్రామంలో త్రాగునీరు సరిగ్గా ఇవ్వడం లేదని అన్నారు. గ్రామంలో పైపులైన్ లు లికేజీలు అయ్యి మురికి నీరు చేరడం ద్వారా అనీటిని త్రాగి తీవ్రమైన జ్వరాలు వస్తున్నాయని అన్నారు. అందుకే గ్రామంలో పారిశుద్ధ్యం, త్రాగునీరు సౌకర్యం కల్పించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.రాజు, మహేష్ నాయుడు, బసవరాజు ,కేశవ్ పాల్గొన్నారు

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button