Devanakonda

15 లీటర్ల నాటుసారా స్వాధీనం

దేవనకొండ (పల్లె వెలుగు) మండల పరిధిలోని కరివేముల గ్రామంలో సోమవారం 15 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు యస్ఐ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ నందు విలేకరులతో మాట్లాడుతూ కరివేముల గ్రామానికి చెందిన బోయ శ్రీనివాసులు నాటుసారా విక్రయిస్తున్నాడన్న సమాచారం మేరకు కరివేముల గ్రామ శివారులో ఉన్న వంకలో స్థావరంపై దాడి చేసి అక్కడ నాటుసారా విక్రయిస్తున్న బోయ శ్రీనివాసులు ను అదుపులోకి తీసుకుని అతని నుండి 15 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని 500 లీటర్ల బెల్లం ఉటను ధ్వసం చేయడం జరిగిందన్నారు. మండలంలో ఎవరైనా నాటుసారా, కర్ణాటక మద్యం, మట్కా, బెట్టింగ్, జూదాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button