Devanakonda

దేవనకొండ మండల హెడ్ క్వార్టర్ లో ఉన్న షాపుల యజమానులకు హెచ్చరికలు

దేవనకొండ (పల్లె వెలుగు) 07 నవంబర్: అంగళ్ళ ముందర ఏదేని వాహనాలను ఆపకుండా చూసుకోవలసిన బాధ్యత మీదే. మీ షాప్ లో ని చెత్తాచెదారం  రోడ్లపై వేయరాదు. అనగా టీ గ్లాసులు, డిస్పోజ్ గ్లాసులు, ప్లాస్టిక్ కవర్స్, చెడిపోయిన పదార్థాలు పూలు పండ్లు  మరియు వేస్టేజ్ వంటిది  వేయరాదు. మీ చెత్తాచెదారాన్ని ఏదైనా అట్టపెట్టెల లో గాని ప్లాస్టిక్ డబ్బాలో గాని నిల్వ ఉంచి పంచాయతీ బండి వచ్చినప్పుడు వారికి అప్పగించవలెను. అలాగే ప్రజలందరూ షాపులు ముందర ఆపే టప్పుడు ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా షాపుల వారికి ఇబ్బంది లేకుండా మీ వాహనాలను పార్కింగ్ చేసుకోవలెను  మరీ ముఖ్యంగా బస్టాండు పరిసర ప్రాంతాలలో రోడ్లపై ఉన్న తోపుడు బండ్లు కూడా తీసివేయవలెను. రోడ్డుకు దూరంగా పెట్టుకోవలెను. మీ వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగును. గ్రామంలోకి పందులను వదలరాదు. వాటిని కూడా త్వరగా క్లియర్ చేయవలెను. రోడ్లపై చెత్త వేసిన వారిపై , ఇష్టం వచ్చినట్టు పార్కింగ్ చేసిన వారిపై, రోడ్లపై తోపుడు బండి పెట్టిన వారిపై న్యూసెన్స్ కేసులు కట్టి  కఠిన చర్యలు తీసుకోబడును. ఇదేవిధంగా మండలంలోని అన్ని ముఖ్య గ్రామాలలో ఈ నియమాలు పాటించాలని దేవనకొండ ఎస్ఐ ఏపీ శ్రీనివాసులు అన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button