Devanakonda

ప్రతిచేరువుకు హంద్రీనీవా నీళ్ల కై చెరువు సందర్శన

  • ప్రతిచేరువుకు రైతుసంఘం కార్యక్రమంలో నేలతలమరి గ్రామ చెరువు సందర్శన
  • హంద్రీనీవా ప్రాజెక్టునుండి పిల్లకాలువలు తవ్వి చెరువుకు నీళ్లు నింపాలి.

దేవనకొండ (పల్లె వెలుగు) 07 నవంబర్:  మండలం లోని ప్రతిచేరువుకు హంద్రీనీవా నీళ్ళకై ప్రతిచేరువుకు రైతుసంఘం కార్యక్రమంలో భాగంగా ఆంద్రప్రదేశ్ రైతుసంఘం బృందం నేలతలమరి గ్రామ చెరువును సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న   ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.జగదీష్, మండల కార్యదర్శి శివశంకర్ లు మాట్లాడుతూ ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రజలు కోసం పనిచేసే అధికారులు ,రాజకీయ పార్టీలు మండలం లో వ్యవసాయం,రైతు పరిస్థితిని ఆలోచించి రైతు శ్రేయస్సు కోసం పనిచేయాలని కోరారు. మండలం లో 90% వ్యవసాయ రంగం పై ఆధారపడి జీవిస్తున్నారని అయితే అతివృష్టి, అనావృష్టి లో ఖరీఫ్ సీజన్లలో పంటలు పండకపోతే 10 ఎకరాలు పొలం ఉన్న రైతుకుడా మూట లు కట్టుకొని హైదరాబాద్, గుంటూరు, బెంగళూరుకు వలస వెళ్తున్న పరిస్థితి ఉన్నదని ఈ పరిస్థితి మారి దేవనకొండ మండలం సస్యశ్యామలం అవ్వాలంటే హంద్రీనీవా ద్వారా దేవనకొండ మండలం లో ప్రతిచేరువుకు పిల్లకాలువలు తవ్వి చెరువులు అన్ని నింపి రైతుల పంటపొలాలు కు నీళ్లు ఇవ్వాలని కోరారు. రాజకీయ పార్టీలు ఆలోచించి హంద్రీనీవా ప్రాజెక్టు నుండి మండలం లో చెరువులకి నిల్లునింపేందుకు నూతన పిల్లకాలువలు తవ్వి చెరువుల కు నీళ్లు నింపి రైతులకు పంట పొలాలకు నీళ్లు ఇచ్చేవరకు పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లన్న, ఎం.రాజు,వై.ఆంజనేయులు, బి. గోవిందు, ఈరన్న, సుంకన్న, కౌలుట్ల లు పాల్గొన్నారు

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button