
Devanakonda
నాటు సారా బట్టీలు ధ్వంసం
గుండ్ల కొండ ( పల్లె వెలుగు) 06 నవంబర్: దేవనకొండ మండలం గుండ్ల కొండ గ్రామ పరిధిలోని కొండలలో మరియు పంట పొలాల్లో ఉన్న నాటు సారా బట్టీలను దేవనకొండ ఎస్సై ఏపీ శ్రీనివాసులు మరియు పోలీసు సిబ్బంది ధ్వంసం చేశారు. బట్టీలను, కుండలను, సుమారు 1000 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. గ్రామం వదిలి పరారీలో ఉన్న నాటు సారా తయారీ దారులు. నర్సి వేముల మరియు P. కోటకొండ గ్రామాల్లో కూడా నాటు సారా ఊట ధ్వంసం. పోలీసులు ఇచ్చిన కౌన్సిలింగ్ వల్ల చాలా గ్రామాల్లో సారా తయారీదారులే స్వచ్ఛందంగా చాలా బట్టీలు ధ్వంసం చేశారు. ఇంకా ఎక్కడైనా బట్టీలు ఉంటే స్వచ్ఛందంగా ధ్వంసం చేయాలి. వారి మీద కేసు నమోదు చేయకుండా ఒక్క అవకాశం ఇస్తాము. లేదా వారిపై కఠిన చర్యలు తీసుకోబడును.