Devanakonda

డి ఎన్ టి హాస్టల్ కి సొంత భవనాలు నిర్మించాలని ఆర్ డి ఓ కు విన్నపము

దేవనకొండ  (పల్లె వెలుగు) 05 నవంబర్: మండల కేంద్రమైన దేవనకొండ నందు గత 30 సంవత్సరాలుగా డీ ఎన్ టి హాస్టల్ కు సొంత భవనాలు లేక విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితులు దాపురించాయని కావున డిఎన్టీ హాస్టల్ కు సొంత భవనాలు నిర్మించాలని “రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్” కి వినతి పత్రం సమర్పించినట్లు సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎమ్. వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం దేవనకొండ సచివాలయం తనిఖీ లో భాగంగా వచ్చిన ఆదోని ఆర్డీవోకు సీపీఐ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగామండల కేంద్రమైన దేవనకొండ నందు డిఎన్ టి హాస్టల్ ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా భవనాలు లేకపోవడంతో విద్యా ప్రమాణాలు మెరుగు అవడం లేదన్నారు. నాటి నుండి నేటి వరకు అధికారులు, ప్రజా ప్రతినిధులకు విన్నవించుకున్నా కూడా ఏ మాత్రం ప్రయోజనం లేదన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు, పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు హాస్టల్ నందు ఉండి విద్యను అభ్యసించేందుకు అనుగుణంగా నూతన భవనాలను నిర్మించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలన్నారు. మండల కేంద్రంలో ఉన్న హాస్టల్ కు సొంత భవనాలు లేకపోవడంతో విద్యార్థులు హాస్టల్ నందు చేరడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. కావున ఇప్పటికైనా హాస్టల్ కు సొంత భవనాలు నిర్మాణం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రెగ్యులర్ గా హాస్టల్ ను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 ఆర్డీవో వివరణ:

దేవనకొండ నందు గల డిఎన్ టి హాస్టల్ కు సొంత భవనాలు నిర్మాణం కొరకు తక్షణమే “బీసీ వెల్ఫేర్ ఆఫీస్” కి మీరు ఇచ్చిన మెమోరాండం ను పంపి భవనాల నిర్మాణాన్ని చేపట్టేలా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్డివో ను కలిసిన వారిలో పార్టీ , విద్యార్థి సంఘం నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button