Devanakonda

మండలాన్ని కరువు ప్రకటించి, పరిహారం ఇవ్వండి.

వామపక్షాల  ఆధ్వర్యంలో తాసిల్దార్  కార్యలయం ముందు నిరసన,వినతి పత్రం.

దేవనకొండ ( పల్లె వెలుగు) 01 నవంబర్: ఖరీఫ్ సీజన్లో అత్యల్ప వర్షపాతం ఈ నేపథ్యంలో మండలంలోని పంటలు పూర్తిగా ఎండిపోయి దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, ఎకరాకు 30 వేలరూపాయల పరిహారం ఇవ్వాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో తాసిల్డర్ కార్యాలయం ముందు మండలాన్ని కరువు ప్రాంతంగా గా ప్రకటించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు బి. వీరశేఖర్, సిపిఐ మండల కార్యదర్శి  యం.నరసారావు లు మాట్లాడుతూ తీవ్ర కరువు నేపథ్యంలో జిల్లాలో దాదాపు 36 మండలాల్లో అత్యల్ప వర్షపాతం కు గురై పంటలు పూర్తిగా ఎండి పోయాయన్నారు. పంట దిగుబడి లేని నేపథ్యంలో కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని వివిధ రాజకీయ పార్టీలు,ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న కూడా ప్రభుత్వము మరియు అధికారులు రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూన్నారని ఆరోపించారు. కరువు ప్రకటనలో జాప్యం చేస్తున్నారని ఇప్పటికే జిల్లాలోని కరువు ప్రాంతాల్లో లోటు వర్షపాతం మరియు పంటల పరిస్థితి ప్రభుత్వం దృష్టికి మరియు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళినా ప్రభుత్వము మరియు అధికారుల నిర్లక్ష్య వైఖరితో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. వరుసగా అతివృష్టి, అనావృష్టి వలన రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అవుతుందని  వారు పేర్కొన్నారు. ఈ సంవత్సరం వేసిన వేరుశనగ,పత్తి, టమోటా వంటి పంటలు పూర్తిగా దిగుబడులు లేకుండా పోయాయని దిగుబడి వచ్చిన నుండి కొన్ని రకాల కూరగాయల పంటలకు కూడ సరైన గిట్టుబాటు ధర లేకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కరువు మండలాల ప్రకటనలో ప్రభుత్వం ఇదే విధంగా జాప్యం చేస్తే మండల వ్యాప్తంగా రైతాంగం, ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల కార్యకర్తలు, రైతులు వెంకటేశ్వర్లు,భాస్కర్, ఫయాజ్, తెర్నేకల్ రాజమాల్ భాష, ఖాన్ రైతులు లింగన్న, కౌలయ్యా, రామాంజనేయులు, పెద్దయ్య, తిమ్మప్ప,రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button