Devanakonda

హంద్రీనీవా ద్వారా నూతన  పిల్లకాలువలును తవ్వి మండలం లో ప్రతి చెరువుకు నీళ్లు ఇవ్వాలి

సీపీఐ రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్రయ్య

దేవరకొండ  ( పల్లె వెలుగు ) హంద్రీనీవా సృజల స్రవంతి కాలువ ద్వారా నూతన పిల్లకాలువలు తవ్వి దేవనకొండ మండలం లో నేలతలమరి,బైరవకుంట,వెంకటాపురం, బుర్రకుంట, బంటుపల్లి,చెల్లెలిచెలిమల,గుడిమరాళ్ల, బేతపల్లి తదితర గ్రామాల చెరువులు కి నీళ్లు నింపి రైతులకు సాగునీరు గ్రామాలకు త్రాగునీరు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగేంద్రయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేవనకొండ లో రైతుసంఘం సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు నాగేంద్రయ్య,సహాయ కార్యదర్శి జగదీష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ దేవనకొండ మండలం లో మండల కేంద్రానికి పక్కనే ఉన్న బైరవకుంట గ్రామం నుండి కిష్ణగిరి మండలం పక్కనే ఉన్న పి.కోటకొండ గ్రామం వరకు ఎక్కడ కూడా హంద్రీనీవా ద్వారా రైతులకు చుక్కనీరు అందడం లేదని అన్నారు. నిత్యం కరువులు కు నిలయం అయిన దేవనకొండ మండలంలో  ప్రధానం గా ఖరీఫ్ లో పండే పంటల పై ఆధారపడి వ్యవసాయం కు పెట్టుబడులు పెట్టి వేల ఎకరాల్లో పత్తి,వేరుశనగ, టమోటో తదితర పంటలు సాగుచేస్తే పెట్టుబడులు  పెట్టిన డబ్బులు కుడా రాక మరొక పంట సాగుచేసే అవకాశం లేక సారవంతమైన భూములు ఉన్న రోజు వారి కూలీగా గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు కు మూట ముల్లె సర్దుకుని వలసబాట పట్టరాని ఆవేదన వ్యక్తంచేశారు. హంద్రీనీవా ద్వారా నూతన పిల్లకాలువలు తవ్వి చెరువులు కు నీళ్లు ఇస్తే పంటలు పండించి,పదిమందికూలీల  కి ఉపాధి కల్పిస్తాడని దీని ద్వారా మండల అభివృద్ధి సాధ్యం అవుతుంది అని అన్నారు. ప్రభుత్వం,ప్రజాప్రతినిధులు స్పందించి ఈ పిల్లకాలువలు ను పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివశంకర్, మహేష్,నాగమద్ది,రంగన్న,ఆంజనేయులు,నరేంద్ర తదితరులు పాల్గొన్నారు

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button