
వి.ఆర్. పి .ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కప్పట్రాళ్ల మల్లికార్జున
దేవనకొండ (పల్లె వెలుగు) 29 అక్టోబర్: గురువారం 28 వ తేదీన కర్నూలులో జరిగిన వి .ఆర్. పి .ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశంలో కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన కప్పట్రాళ్ల మల్లికార్జున వి. ఆర్.పి. ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. నూతనంగా వి.ఆర్.పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఎన్నికైన కప్పట్రాళ్ల మల్లికార్జున మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేంతవరకు తనవంతుగా ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తూనే ఉంటానని అన్నారు. వాల్మీకుల చిరకాల కోరిక అయిన ఎస్టీ సాధన కోసం డిసెంబర్ నెలలో ఢిల్లీలో జరిగే పులి కేకకు ప్రతి ఒక్క వాల్మీకి ముద్దు బిడ్డ తరలిరావలి పిలుపునిచ్చారు. వాల్మీకి ఎస్టీ సాధన కోసం నేను చేసిన కృషికి నాకు వి.ఆర్ పి .ఎస్ .రాష్ట్ర ఉపాధ్యక్షుడి పదవి ఇవ్వడం పట్ల వి. ఆర్. పి. ఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ కు, వి ఆర్ పి ఎస్ రాష్ట్ర, జిల్లా , మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.