
Devanakonda
చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచు చుకోవాలి
దేవనకొండ (పల్లె వెలుగు) 27 అక్టోబర్: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచు చుకోవాలని పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి దివ్య అన్నారు. బుధవారం మండలం కేంద్రమైనా దేవనకొండ లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఏవైనా సమస్యలు ఉంటే చట్టానికి లోబడే పరిష్కరించుకోవలన్నారు.వారసత్వం గా సంక్రమించిన ఆస్తులను భాగపరిష్కరలు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఇంద్రాణి, పత్తికొండ రూరల్ సీ.ఐ రామకృష్ణ రెడ్డి, యస్.ఐ ఏ.పి శ్రీనివాసులు, న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్, ఏ. ఓ సురేష్ బాబు,న్యాయవాదులు నరసరావు, నాగభూషణం రెడ్డి, దామోదర ఆచారి, మహేష్, ప్రసాద్ బాబు, భాస్కర్, అరుణ్ కుమార్, నరసింహులు,కబీర్, ఇళయస్ పాల్గొన్నారు.