Devanakonda

కరువు మండలం గా ప్రకటించి నష్టపరిహారం ఇవ్వాలి

రాష్ట్ర ప్రభుత్వం కరువు పరిస్థితులు ను కేంద్రం దృష్టికి తీసికెళ్లి సహాయక చర్యలు తీసుకోవాలి

సీపీఐ రైతుసంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి

దేవనకొండ (పల్లె వెలుగు) 28 అక్టోబర్: మండలం లో ఖరీఫ్ సీజన్ యందు సరైన వర్షాలు కురవక ,రైతు పెట్టిన పెట్టుబడి,శ్రమకి తగిన ప్రతిఫలం దక్కక పోగా వ్యవసాయ పెట్టుబడులు కోసం తెచ్చిన అప్పులు కు వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది అని రైతులను ఆదుకునేందుకు తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని సీపీఐ-ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం కోరింది. ఈ సందర్భంగా స్థానిక ఎం.ఆర్.ఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ నబీరసూల్ కు రైతులతో కలసి వినతిపత్రాన్ని అందజేశారు. సీపీఐ-ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లాసహాయ కార్యదర్శి ఎం.జగదీష్, మండల కార్యదర్శి.శివశంకర్ లు మాట్లాడుతూ రైతులు వ్యవసాయ సాగు నిమిత్తం తెచ్చి పెట్టిన పెట్టుబడులు, వడ్డీలు కూడా చేతికి వచ్చే పరిస్థితులు లేవని అన్నారు. అందుకు రైతులు పరిస్థితి దృష్టిలో ఉంచుకొని ఈ ఖరీఫ్ సీజన్ నందు  బ్యాంకు ల్లో రైతులు తీసుకున్న అప్పులు రద్దుచెయ్యాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు పరిస్థితులు ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రానికి కేంద్రకరువు పరిశీలన బృందం పర్యటించి తక్షణమే కరువు సహాయ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహేష్ నాయుడు, రైతులు పాల్గొన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button